బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ(BJP) పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్ ముంబైలో ఇల్లు అమ్ముకుంది
బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ(BJP) పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్(Kangana Ranauth) బాంద్రాలోని తన బంగ్లాను కోయంబత్తూరుకు చెందిన కమలినీ హోల్డింగ్స్‌కు రూ.32 కోట్లకు విక్రయించింది. బాంద్రాలోని పాలి హిల్‌లోని చేతక్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల ఇల్లును కంపెనీ తన భాగస్వామి శ్వేతా బతిజా ద్వారా కొనుగోలు చేసింది. 565 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక కార్ పార్కింగ్‌తో 3,075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెసిడెన్షియల్-కమ్-ఆఫీస్ బంగ్లా సెప్టెంబర్ 5న రిజిస్ట్రేషన్ చేవారు. రియల్ ఎస్టేట్ పోర్టల్ అందుబాటులో ఉన్న పత్రాలను చూపించారు. స్టాంప్ డ్యూటీకి రూ.1.92 కోట్లు, రిజిస్ట్రేషన్ కోసం మరో రూ.30,000 చెల్లించారు. సెప్టెంబరు 2017లో రూ.20 కోట్లతో బంగ్లాను కంగనా కొనుగోలు చేసింది. ఈ భవనంలో కొంత భాగాన్ని తన కార్యాలయంగా మార్చుకుంది. 2020లో, శివసేన అధికారంలో ఉన్న ముంబై మునిసిపల్ కార్పొరేషన్ మార్పులను చట్టవిరుద్ధమంటూ నిర్మాణాన్ని పాక్షికంగా కూల్చివేసింది. దీనిపై కంగానా రౌనౌత్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలపై హైకోర్టు కూడా కంగనా రనౌత్‌కు అనుకూల తీర్పు ఇచ్చింది. నిర్మాణాలను, మార్పులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్‌లో, రనౌత్ అంధేరీలో 407 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1.56 కోట్లతో వాణిజ్య స్థలాన్ని కొనుగోలు చేశారు. భారత ఎన్నికల కమిషన్‌లో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం దాదాపు రూ.91 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమెకు 50 బీమా పాలసీలు, రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల బంగారం, రూ.50 లక్షల విలువైన 60 కిలోల వెండి, రూ.3 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.