నాగబాబు గారు మీకు కూడా ఒక కూతురు ఉంది.
అత్యాచారం(Rape), లైంగిక వేధింపుల(sexual assault) కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) ఎలాంటివాడో నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత(Madhavi latha) వివరించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో అతడిపై ఆరోపణలు చేశారు. 'జానీ అనే వాడికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అందులో జనసేన నాయకుడు నటుడు నాగబాబు(Nagababu) కూడా ఉన్నాడు. నాగబాబు గారు మీకు కూడా ఒక కూతురు ఉంది. మీరు ఇలా మాట్లాడటం సరికాదు. మీ అమ్మాయి కంటే చిన్నపిల్ల ఇంకా ఆ అమ్మాయి. జానీ అనే వాడు మీ వరకు మంచి వ్యక్తి కావచ్చు కానీ ఆ అమ్మాయి విషయంకు వచ్చేసరికి మంచి వ్యక్తి కాడు. సాక్ష్యంగా నేనున్నాను. పుష్ప 2(Pushpa 2) సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి జానీ వచ్చి చాలా పెద్ద రచ్చ చేశాడు. ఆ షూటింగ్‌లోనే జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు!. సుకుమార్ దానికి పంచాయితీ పెట్టి క్లియర్ చేశాడు. ఈ విషయం అల్లు అర్జున్‌కు తెలుసు కాబట్టే ఆ అమ్మాయికి అండగా నిలబడ్డాడు. రీసెంట్‌గా విశ్వక్‌సేన్(Vishwak sen) మూవీలో కూడా అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేశాడు. నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆమెను టార్చర్ పెడుతున్నాడు. ఆ టార్చర్ భరించలేకే అతడి నుంచి దూరంగా వచ్చి సెపరేట్‌గా సినిమాలు చేసుకుంటుంది. ఎవరు అయితే జానీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్లందరూ తప్పు చేస్తున్నట్లే. ఇప్పటికైనా మారండి' అంటూ ఆ వీడియోలో మాధవీలత చెప్పుకొచ్చారు.