అమలాపాల్(Amala Paul). భిన్నమైన, విలక్షణమైన నటి. నీలతామర అనే మలయాళ సినిమాతో ఆమె చలనచిత్ర ప్రస్థానం మొదలయ్యింది. మైనా(Maina) సినిమాతో కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. సంచలనం, వివాదం రెండూ ఆమె వెన్నంటే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. మైనా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు. నటిగా తానేంటో రుజువు చేసుకున్నారు.
అమలాపాల్(Amala Paul). భిన్నమైన, విలక్షణమైన నటి. నీలతామర అనే మలయాళ సినిమాతో ఆమె చలనచిత్ర ప్రస్థానం మొదలయ్యింది. మైనా(Maina) సినిమాతో కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. సంచలనం, వివాదం రెండూ ఆమె వెన్నంటే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. మైనా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు. నటిగా తానేంటో రుజువు చేసుకున్నారు. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. విజయ్(Vijay), ధనుష్(Dhanush) వంటి టాప్ హీరోలతో కలిసి నటించిన అమలాపాల్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. నటిగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే దర్శకుడు విజయ్‌ను(Director Vijay) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యం ఎక్కువ రోజులు నిలవలేదు. రెండేళ్లలోపే మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కాగా అమలాపాల్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో(Social Media) తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఒకప్పుడు తను అనుభవించిన మానసిక వేదన గురించి చెప్పారు అమలాపాల్. మైనా సినిమా తర్వాత తాను చాలా మానసిక వేదనను అనుభవించానని తెలిపారు. జీవితంలో మోసపోయాను అని అనడం కంటే మోసగించబడ్డానన్నదే కరెక్టని చెప్పారు. కరోనా కాలంలో రెండేళ్ల పాటు ఇంట్లోనే కూర్చొని తన గురించి తాను ఆలోచించుకుని ఆవేదన చెందానన్నారు. తనను చూసి తన కంటే ఎక్కువ తన తల్లి బాధపడిందని తెలిపారు. తనకు మార్గదర్శి అంటూ ఎవరూ లేరని, ఒక వేళ అలాంటి వ్యక్తి ఎవరైనా వుండి వుంటే తానూ అందరిలా ఆనందంగా ఉండేదానినేమోనని పేర్కొన్నారు. ఆ మధ్య నిర్మాతగా మారి కొన్ని సినిమాలను కూడా నిర్మించారు అమలాపాల్. ప్రస్తుతం మలయాళంలో మూడు చిత్రాలు, తమిళంలో ధనుష్ నటిస్తున్న 50వ చిత్రంలో అమలాపాల్ నటిస్తున్నారు.