హేమ కమిటీ నివేదిక(hema committee report) మలయాళ సినిమాలను కుదిపేసింది.
హేమ కమిటీ నివేదిక(hema committee report) మలయాళ సినిమాలను కుదిపేసింది. ఇతర పరిశ్రమలలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడులో(Tamil industry) నటి రాధిక శరత్‌కుమార్(Radhika sharath kumar) ఈ విషయం గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. తమిళ చిత్రసీమలో లైంగిక వేధింపుల సమస్యలను పరిష్కరించేందుకు నడిగర్ సంఘం (తమిళనాడు నటీనటుల సంఘం) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నటి రోహిణి అధ్యక్షత వహిస్తున్నారు. ఫిర్యాదులను సైబర్ పోలీసులతో పంచుకుంటామని, లైంగిక వేధింపులకు పాల్పడిన ఎవరైనా తమిళ చిత్ర పరిశ్రమ నుండి ఐదేళ్లపాటు నిషేధించబడతారని ఇటీవల పేర్కొంది.
అయితే సినిమా సెట్స్‌లో(Movie set) సౌకర్యాలపై నటి ఐశ్వర్య రాజేష్(Aishwarya rajesh) స్పందించింది. 'నేను చిత్ర పరిశ్రమలో 12 సంవత్సరాలుగా ఉన్నాను. సినిమా సెట్లలో మహిళా నటులకు మొదట పరిష్కరించాల్సిన సమస్య టాయిలెట్. మహిళలు అవుట్‌డోర్ షూట్‌లకు వెళ్ళినప్పుడు సరైన టాయిలెట్ల సౌకర్యం ఉండడం లేదు. తనకు అన్ని సౌకర్యాలతో కూడిన వ్యాన్ ఉంటుంది. కానీ సినిమాలో నటించే ఇతర మహిళల పరిస్థితి ఏంటో చెప్పాలి. సుదీర్ఘమైన ఔట్‌డోర్ షూటింగ్(Out door shoot) ఉన్నప్పుడు ముఖ్యంగా మహిళలకు టాయిలెట్ సౌకర్యం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నానని ఐశ్చర్య చెప్పారు. చిత్ర పరిశ్రమలోని మహిళలకు నేను ఇచ్చే సలహా ఇదే "మీరు చాలా స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండాలని.. మిమ్మల్ని ఎవరైనా బుల్‌డోజ్ చేయడాన్ని అంగీకరించకూడదని.. ఏ విషయమైనా నచ్చకపోతే మొహం మీదనే చెప్పాలని' ఆమె సూచించింది.