దిగ్దర్శకుడు శంకర్‌(shankar) కూతురు అదితి శంకర్‌(Adithi shankar) నటిగా తనేమిటో ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్నారు. అందము ప్లస్‌ అభినయం ఆమె సొంతం. విరుమాన్‌ సినిమాతో అదితి శంకర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో కార్తీ(Karthi) హీరోగా నటించారు. మొదటి సినిమాతోనే ఆమె ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్ నటించిన మావీరన్‌లో కథానాయిక పాత్రను పోషించారు. ఈ సినిమా కూడా సూపర్‌హిట్‌ అయ్యింది. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాశ్‌ మురళీకి జోడిగా నటిస్తున్నారు.

దిగ్దర్శకుడు శంకర్‌(shankar) కూతురు అదితి శంకర్‌(Adithi shankar) నటిగా తనేమిటో ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్నారు. అందము ప్లస్‌ అభినయం ఆమె సొంతం. విరుమాన్‌ సినిమాతో అదితి శంకర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో కార్తీ(Karthi) హీరోగా నటించారు. మొదటి సినిమాతోనే ఆమె ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్ నటించిన మావీరన్‌లో కథానాయిక పాత్రను పోషించారు. ఈ సినిమా కూడా సూపర్‌హిట్‌ అయ్యింది. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాశ్‌ మురళీకి జోడిగా నటిస్తున్నారు. వీటితో పాటు రాక్షసన్‌ ఫేమ్‌ రామ్‌కుమార్‌ కొత్త సినిమాలో కూడా నటించడానికి అదితి అంగీకరించారు. ఇప్పుడు నటుడు సూర్యతో(Surya) కలిసి నటించడానికి రెడీ అవుతున్నారట! సూర్య ప్రస్తుతం శివ(shiva) దర్శకత్వంలో కంగువ(Kanguva) అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్నారు అదితి శంకర్‌. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్ సినిమాలో నటిస్తున్నారు. ఇంతకు ముందు సుధా కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు సినిమాలో నటించిన సూర్యకు విశేషమైన పేరు లభించింది. జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కూడా లభించింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతున్నది. ఇది సూర్య నటించే 43వ సినిమా అవుతుంది. ఇందులో సూర్యకు జంటగా అదితి శంకర్‌ నటించబోతున్నారని తెలిసింది. ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్‌ సంగీతం అందించనున్నారు. కార్తీతో నటించి విజయాన్ని అందుకున్న నటి అదితి శంకర్‌ ఇప్పుడు ఆయన అన్నయ్య సూర్యతో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ రూపొంచబోయే సినిమాలో కూడా సూర్య నటిస్తున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Updated On 21 Aug 2023 8:27 AM GMT
Ehatv

Ehatv

Next Story