హీరో సిద్థార్ధ్ (Siddharth)తో తన రిలేషన్ షిప్ పై వస్తున్న వార్తలపై స్పందించింది హీరోయిన్ అదితీరావు హైదరీ. పార్టీలు ఫంక్షలు అని తిరుగుతున్నవీరిపై సోసల్ మీడియా రకరకాలుగా కోడై కూస్తోంది. మరి ఈ విషమంలో అదితీ ఏమని స్పందించిందంటే..
హీరో సిద్థార్ధ్ (Siddharth)తో తన రిలేషన్ షిప్ పై వస్తున్న వార్తలపై స్పందించింది హీరోయిన్ అదితీరావు హైదరీ. పార్టీలు ఫంక్షలు అని తిరుగుతున్నవీరిపై సోసల్ మీడియా రకరకాలుగా కోడై కూస్తోంది. మరి ఈ విషమంలో అదితీ ఏమని స్పందించిందంటే..
చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు సిద్దార్థ్(Siddharth) - అదితీరావు హైదరీ(Aditi Rao Hydari). మహాసముద్రం(Mahasamudram)లో కలిసి నటించారు ఈజంట. అప్పటి నుంచీ వీరు ప్రేమలో మునిగి తేలున్నారంటూ.. రూమర్స్ తెగ వినిపిస్తున్న టైమ్ లో.. అదితీ ఈ రూమర్స్ పై స్పందించింది బ్యూటీ. మహాసముద్రం సినిమా నుంచి వీరి పరిచయం పెరిగింది. అది స్నేహంగా మారింది. మరి అది ప్రేమగా మారిందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ ఇద్దరు ఈ విషయంలో స్పందించలేదు. వారికి పెద్దగా ఈ విషయంలో ఎప్పుడూ ప్రశ్నలు కూడా ఎదురవలేదు అయితే రీసెంట్ గా సిద్దార్ధ్ తో డేటింగ్ పై స్పందించింది అదితీరావు హైదరీ. ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఈ ప్రశ్న ఎదురయ్యింది.
వీరు ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వార్తలు గత కొద్ది కాలంగా జోరుగా సాగుతున్నాయి. ఈక్రమంలో ఈ వార్తలపై స్పందించింది అదితీరావు హైదరీ(Aditi Rao Hydari). తాజ్ సినిమా సక్సెస్ అవ్వడంతో.. ఓ ఛానల్ కుఇంటర్వ్యూ ఇచ్చింది బ్యూటీ. ఈసందర్బంగా విలేకరి అడిగిన ప్రశ్నకు దిఫరెంట్ గా సమాధానం చెప్పింది. సిద్థార్ధ్ తో మీరు రిలేషన్ లో ఉన్నారా..? బయట జరుగుతున్న ప్రచారానికి మీరు ఏం సమాధానం చెపుతారు అంటూ.. అడిగిన ప్రశ్నకు.. అదితీ స్పందిస్తూ.. ఇలాంటిది ఏమైనా ఉంటే తానే ముందుగా ప్రకటిస్తానంది. దాచుకోని సీక్రేట్ గా మెయింటేన్ చేయాల్సిన అవసరం లేదు అంటోది బ్యూటీ.
అయితే మరోసారి సిద్థార్ద్(Siddharth) తో డేటింగ్ గురించి విలేఖరి ప్రశ్నించారు అదితీని(Aditi Rao Hydari). ఆడియన్స్ ఈ విషయంలో క్లారిటీ అడుగుతున్నారు అంటూ ప్రశ్నించగా.. ఆమెకు కాస్త కోపం వచ్చింది.. హసహనానికి గురయ్యారు. అంతే కాదు మీకుఏం అభిప్రాయం ఉందో అంది చెప్పండి ముందు.. ఒక వేళ నేను ఏది చెప్పినా... మీరు మీకు నచ్చింది రాసుకుంటారు.. దానికి నేనేం చేయ్యగలను. ఆడియన్స్ నుంచి ఈప్రశ్న వచ్చింది అంటున్నారు... కాని నన్నెప్పుడూ.. ఆడియన్స్ కాని.. ఫ్యాన్స్ కాని నన్ను ఎప్పుడూఈ ప్రశ్న అడగలేదన్నారు
అందరితో పంచుకోవల్సిన విషయం ఏదైనా ఉంటే.. దాన్ని దాచుకోవాల్సిన అవసరం తనకు లేదు అంటోమది అదితీ రావు(Aditi Rao Hydari).అంతే కాదు కొంత మందికి మా గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి విషయాలు.. తెలుసుకోవాలి అని ఉంటుంది. మరికొంత మందికి తమ సినిమాల గురించి..తమను స్క్రీన్ పై చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నారు. ఆడియన్స్ తమపై చూపించి అభియానంతోనే.. ఇంకా పనిమీద ప్రేమ పెరుగుతుందన్నారు అదితీ. అంతే కాదు దాని కోసం తాము ఎంత కష్టపడటానికైనా రెడీ అంటున్నారు. మేము కష్టపడి పనిచేయాలి.. మీకు మంచి కంటెంట్ అందించాలి.. మాను ఉన్న ఆలోచన అది ఒకటే అన్నారు అదితీరావు.