2008లో 1920 సినిమాతో తెర‌కు ప‌రిచ‌య‌మైన అదా శర్మ(Adah sharma).. 2014లో హర్ట్‌ ఎటాక్(Heart attack) అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌న అభిన‌యంతో మొద‌టి సినిమాతోనే ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ తర్వాత తెలుగులో ఆమె న‌టించిన‌ క్ష‌ణం(Kshanam) సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్ మాత్రం ఆమెకు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత‌ పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్ర‌ల్లో మెరిసింది.

2008లో 1920 సినిమాతో తెర‌కు ప‌రిచ‌య‌మైన అదా శర్మ(Adah sharma).. 2014లో హర్ట్‌ ఎటాక్(Heart attack) అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌న అభిన‌యంతో మొద‌టి సినిమాతోనే ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ తర్వాత తెలుగులో ఆమె న‌టించిన‌ క్ష‌ణం(Kshanam) సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్ మాత్రం ఆమెకు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత‌ పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్ర‌ల్లో మెరిసింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం వంటి సినిమాలలో న‌టించినా ఆదాకు ఇక్క‌డ స‌రైన హిట్ ప‌డ‌లేద‌నే చెప్పాలి. దీంతో బాలీవుడ్‌కే వెళ్లిన అదా శర్మ.. ది కేర‌ళ స్టోరీ(Kerala story) సినిమాతో విప‌రీత‌మైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విజ‌యం త‌ర్వాత ఆమె సెల‌క్టివ్ రోల్స్ మాత్ర‌మే చేసేందుకు మొగ్గుచూపుతుంది.

అయితే ఈ భామ సోష‌ల్ మీడియాలో(social media) ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె ప‌డ‌వ‌లో(Boat) ప్ర‌యాణిస్తూ సేద తీరుతున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఏ పాట ప్లే చేద్దాం.. జ‌ల్దీ చెప్పండి అంటూ త‌న అభిమానులను అల‌ర్ట్ చేసింది. అమ్మ‌డి ఫోటోల‌కు, ఆ ప్ర‌శ్న‌కు ఫిదా అయిన ఫ్యాన్స్ లైక్‌లు, కామెంట్ల రూపంలో అభిమానాన్ని చాటుకుంటున్నారు. అదా శర్మ ప్ర‌స్తుతం సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ 'బస్తర్: ఎ నక్సల్ స్టోరీ(Bastar: A Naxal Story) సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న థియేటర్లలో విడుదల కానుంది.

Updated On 10 Dec 2023 7:48 AM GMT
Ehatv

Ehatv

Next Story