లక్ష్మీ మీనన్‌(Lakshmi Menon). కేరళకు చెందిన ఈ భామ కోలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌..ఎస్‌.ఆర్‌. ప్రభాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన సుందరపాండియన్‌ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టిన లక్ష్మీ మీనన్‌ తర్వాత కుమ్కి జిగుర్తాండ, కుట్టిబులి, పాండియనాడు,నాన్‌ సికపు మన్మన్‌, కొంబన్‌ వంటి సినిమాల్లో నటించింది.

లక్ష్మీ మీనన్‌(Lakshmi Menon). కేరళకు చెందిన ఈ భామ కోలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌..ఎస్‌.ఆర్‌. ప్రభాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన సుందరపాండియన్‌ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టిన లక్ష్మీ మీనన్‌ తర్వాత కుమ్కి జిగుర్తాండ, కుట్టిబులి, పాండియనాడు,నాన్‌ సికపు మన్మన్‌, కొంబన్‌ వంటి సినిమాల్లో నటించింది. మాతృభాష మలయాళమే అయినప్పటికీ ఆ భాషలో చేసిన సినిమాలు తక్కువే. ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిచింది. అన్ని సినిమాలు విజయవంతంగా నడిచాయి. విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన రెక్క సినిమా అయితే తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వేదాళంలో అజిత్‌కు(Ajith) చెల్లెలుగా లక్ష్మీ మీనన్‌ నటించింది.

వేదాళం తర్వాత కొన్నాళ్లుగా లక్ష్మీ మీనన్‌కు అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె చంద్రముఖి 2 సినిమాలో నటిస్తోంది. 27 ఏళ్ల లక్ష్మీ మీనన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట! ప్రముఖ నటుడు విశాల్‌తో(Vishal) ఏడడగులు నడిచేందుకు సిద్ధమవుతున్నారని కోలీవుడ్‌లో టాక్‌. సోషల్‌ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. విశాల్‌తో కలిసి లక్ష్మీ మీనన్‌ పాండియనాడు, ఇంద్రుడు వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలలో విశాల్‌తో ఆమె కెమెస్ట్రీ బాగా కుదరిందని, వీరిద్దరు ప్రేమలో ఉన్నారని సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. తర్వాత వీరిద్దరు కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ రెండు సినిమాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇప్పటి వరకు ఇంట్లో వారికి చెప్పకుండా దాచారని, త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ పుకార్లకు తెరపడదు.

Updated On 8 Aug 2023 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story