హనుమాన్ జంక్షన్‌లో వేణు(Venu) సరసన నటించిన విజయలక్ష్మి గుర్తున్నారా? ఆమె తమిళంలో చాలా సినిమాల్లో నటించారు. ఇప్పుడామె నామ్ తమిళర్ కట్చి నేత(NTK), నటుడు, దర్శకుడు సీమన్‌పై(Seeman) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీసులకు కంప్లయింట్ చేశారు.
హనుమాన్ జంక్షన్‌లో వేణు(Venu) సరసన నటించిన విజయలక్ష్మి గుర్తున్నారా? ఆమె తమిళంలో చాలా సినిమాల్లో నటించారు. ఇప్పుడామె నామ్ తమిళర్ కట్చి నేత(NTK), నటుడు, దర్శకుడు సీమన్‌పై(Seeman) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీసులకు కంప్లయింట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు గురి చేస్తున్న సీమన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు వేడుకున్నారు. తర్వాత మీడియాతో ముచ్చటించిన విజయలక్ష్మి అనేక విషయాలను చెప్పుకొచ్చారు.
తాను సీమన్‌పై గతంలోనూ ఫిర్యాదు చేశానని, ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈసారి తాను పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నానని చెప్పిన విజయలక్ష్మి గత ప్రభుత్వం కనీస విచారణ కూడా చేపట్టలేదని ఆరోపించారు. గతంలోనూ సీమన్‌పై విజయలక్ష్మి ఈ రకమైన ఆరోపణలు చేశారు. 2007-2009 వరకు సీమన్, తాను సహజీవనం చేశామని, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెళ్లికి విముఖత చూపాడని తెలిపారు. పైగా తనపై బెదిరింపులకు పాల్పడుతుండటంతో చెన్నై కమిషనర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు విజయలక్ష్మి.
కానీ సీమన్ సెటిల్‌మెంట్‌కు రావడంతో కేసు విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపారు. తర్వాత మాత్రం మీడియా ముందు తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడాడంటూ మరోసారి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయలక్ష్మి. ఇదిలా ఉంటే అప్పట్లో విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆమెపై ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేశారు కొందరు. దీంతో మనస్తాపానికి గురైన విజయలక్ష్మి 2020లో ఆత్మహత్యాయత్నం చేశారు. సోషల్ మీడియాలో సీమన్, పనన్‌కట్టు పడైకి చెందిన హరి నాడార్ మద్దతుదారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తన చావుకు కారణమైనవాళ్లను వదిలిపెట్టవద్దని ఓ వీడియో పోస్ట్ చేసి మరీ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే సకాలంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెద్ద గండం నుంచి బయటపడ్డారు విజయలక్ష్మి.