నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కూతురు మీరా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నటుడు విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నైలోని అల్వార్‌పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు.

Actor Vijay Antony’s daughter found dead
నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని(Vijay Antony) కూతురు మీరా(Meera) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నటుడు విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై(Chennai)లోని అల్వార్‌పేట(Alwarpeta)లోని డీడీకే రోడ్డు(DDK Road)లో నివసిస్తున్నారు. విజయ్ ఆంటోనీ కూతురు 16 ఏళ్ల మీరా.. చర్చ్ పార్క్ స్కూల్(Church Park School)లో పన్నెండో తరగతి చదువుతుంది. ఒత్తిడికి లోనైన మీరా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లోని పనిమనిషికి బెడ్‌రూమ్(Bedroom)లో దుపట్టాతో ఉరివేసుకుని కనిపించగా.. వెంటనే ఆమెను కావేరీ ఆస్పత్రి(Kaveri Hospital)కి తరలించగా.. అప్పటికే మీరా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఆత్మహత్య(Suicide)గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో నటుడు విజయ్ ఆంటోని ఇంట్లో లేరని చెబుతున్నారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి సంతాపం చెబుతున్నారు.
