1990 హీరోయిన్లలో నగ్మా కూడా అగ్ర హీరోయిన్‌ నిలిచింది. అప్పట్లో హయ్యెస్ట్‌ రెమ్యూనరేషన్‌ యాక్ట్రీస్‌గా నగ్మా ఉండేది.

1990 హీరోయిన్లలో నగ్మా కూడా అగ్ర హీరోయిన్‌ నిలిచింది. అప్పట్లో హయ్యెస్ట్‌ రెమ్యూనరేషన్‌ యాక్ట్రీస్‌గా నగ్మా ఉండేది. నగ్మ అలియాస్ నందిత 1974 డిసెంబర్ 25న పోరుబందర్, ముస్లింతల్లి షమాకాజి, హిందూ తండ్రి మోరార్జి దంపతులకు జన్మించింది. 1972లో షమాకాజి, అరవింద్ మోరార్జి పెళ్లి చేసుకున్నారు. అరవింద్ మోరార్జి ప్రముఖ వస్త్ర వ్యాపారిగా ఉండేవారు. నగ్మ పుట్టిన మూడు నెలల్లోనే మోరార్జితో నగ్మ తల్లి షమాకాజి విడిపోయారు. ఆ తర్వాత 1975లో షమాకాజి బాలీవుడ్‌ నిర్మాత చంద్రసదన్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటికే చంద్రసదన్‌కు రాధిక అనే మహిళతో పెళ్లయి రోహిణి, సూరజ్ అనే ఇద్దరు పిల్లలున్నారు. వీరు కూడా విడిపోయిన తర్వాత చంద్రసదన్‌ నగ్మ తల్లి షమాకాజిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 1977లో జ్యోతిక జన్మించింది. ఆ తర్వాత వారికి ధన్‌రాజ్, యువరాజ్ జన్మించారు. దీంతో నగ్మాకు మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు అనుకోవాలి.

అయితే 48 ఏళ్లు వచ్చినా నగ్మా పెళ్లి చేసుకోలేదు. దీనికి అనేకానేక కారణాలున్నాయి. నగ్మాను హీరోయిన్‌ చేయడం తల్లికి ఒక కలగా ఉండేది. నిర్మాతగా ఉన్న చంద్రసదన్‌ను నగ్మాను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు షూటింగ్‌లకు తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో నగ్మాకు అవకాశాల కోసం ప్రయత్నించాడు. చిన్న వయసు కావున నగ్మాకు అవకాశాలు ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో నగ్మాకు హార్మోన్ ఇంజక్షన్లు కూడా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రసదన్‌కు మాఫియాతో ఉన్న లింకులతో సల్మాన్ సినిమా బాఘీలో నగ్మాకు అవకాశం దక్కింది. అప్పుడు షూటింగ్‌లో ఉన్న డైరెక్టర్‌ శరత్‌కు నగ్మా నటన నచ్చింది. దీంతో తెలుగుసినీ రంగంలోకి నగ్మా అడుగుపెట్టేందుకు అవకాశాలు దక్కాయి. సుమన్ సరసన పెద్దింటి అల్లుడులో నగ్మా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. నాగార్జునతో కిల్లర్ సినిమా, చిరంజీవితో ఘరానా మొగుడు సినిమాల్లో అవకాశాలను కొల్లగొట్టింది. అటు బాఘీ, ఇటు ఘరానా మొగుడు పెద్ద హిట్ కావడంతో ఇక నగ్మా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అశ్వమేధం, మేజర్ చంద్రకాంత్, వారసుడు, అల్లరి అల్లుడు, గ్యాంగ్ మాస్టర్ సహా 27 సినిమాల్లో నగ్మా నటించింది. బెవఫా, సెవఫా, దిల్‌వాలే వంటి బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించి దేశంలోనే బిజీయెస్ట్ నటిగా మారిపోయారు. తమిళ సినిమా కదలన్‌లో ప్రభుదేవా పక్కన నటించే అవకాశం దక్కడంతో అక్కడ కూడా మంచిమంచి అవకాశాలు వచ్చాయి. బాషా సినిమాలో రజినీకాంత్‌ సరసన నటించి మరింత పేరు సంపాదించింది. ఇటు టాలీవుడ్‌లో కూడా నగ్మా సినిమాలకు బయ్యర్లు పోటీ పడేవారు. తన చెల్లెల్లు అయిన రోహిణిని మాస్టర్‌ సినిమాలో చిరంజీవి పక్కన సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని నగ్మా కల్పించింది. మరో చెల్లి జ్యోతికను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా 2001 వరకు దాదాపు 60 సినిమాల్లో నగ్మా నటించింది. దీంతో తన కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీర్చేశారు. అల్లరి అల్లుడులో అత్త పాత్రలో నటించి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టినా అది కొనసాగించలేకపోయింది.

అయితే నగ్మా ఎఫైర్లపై మాత్రం గాసిప్స్ బాగానే వచ్చాయి. రాయల్ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారని.. తిరుపతిలో పెళ్లిచేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. దీంతో గంగూలీ భార్య గొడవ చేయడంతో ఆయన నగ్మాను దూరంపెట్టారట. దీంతో నగ్మా కూడా తన దారి తాను చూసుకుందని అన్నారు. తమిళనటుడు శరత్‌కుమార్‌తో కూడా నగ్మా డేట్‌ చేసిందనే వార్తలు వచ్చాయి. శరత్‌తో కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగినా నగ్మాకు పెళ్లి కాలేదు. శరత్‌కుమార్ తన భార్యకు విడాకులు ఇచ్చినా కానీ రాధికను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయట. ఆ తర్వాత నటుడు రవికిషన్‌తో ప్రేమాయణం కొనసాగించిందని వార్తలు వచ్చాయి. దీంతో రవికిషన్ భార్య ప్రీతి రంగంలోకి దిగి నానా గొడవ చేయడంతో వీరి బంధం మూడు ముళ్లకు మారలేదట. ఇక చేసేదేమీ లేక రవికిషన్‌తో తీవ్రంగా పోటీ పడుతున్న మరో నటుడు మనోజ్ తివారీతో డేట్‌కు వెళ్లిందట. ఆ తర్వాత వీరి బంధం కూడా ముడిపడలేదు. దీంతో తనకు పెళ్లి బంధం అచ్చురాదని అనుకొని ప్రజాసేవ కోసం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు.

Updated On 3 Jan 2025 1:31 PM GMT
ehatv

ehatv

Next Story