‘హనుమాన్’ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు సూపర్ హీరో తేజ సజ్జ. ఈ సందర్భంగా ఫిల్మ్‏ఫేర్ మిడిల్ ఈస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించాడు. అయితే ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించాలని ప్రతీ యువ హీరోకు ఓ కల ఉంటుంది. ఇటీవల ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ మ్యాజైన్‏లో నాగార్జున తప్ప వేరే ఏ హీరోనూ కనిపించలేదు. అయితే ఆ గౌరవం ఇప్పుడు తేజ సజ్జకు దక్కింది.

‘హనుమాన్’ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు సూపర్ హీరో తేజ సజ్జ. ఈ సందర్భంగా ఫిల్మ్‏ఫేర్ మిడిల్ ఈస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించాడు. అయితే ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించాలని ప్రతీ యువ హీరోకు ఓ కల ఉంటుంది. ఇటీవల ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ మ్యాగజైన్‏లో నాగార్జున తప్ప వేరే ఏ హీరోనూ కనిపించలేదు. అయితే ఆ గౌరవం ఇప్పుడు తేజ సజ్జకు దక్కింది.

తన విలక్షణమైన నటనతో, గమ్మత్తయిన కథల ఎంపికతో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాడు ఈ యువ హీరో. ‘జాంబిరెడ్డి’, ‘ఓ బేబి’, అద్భుతం వంటి చిత్రాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తేజ సజ్జ ఓ ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మూవీస్‏లో ఒకటిగా నిలిచే ‘హనుమాన్’ మూవీతో మన ముందుకి రాబోతున్నాడు ఈ యువ హీరో. చైల్డ్ ఆర్టిస్టుగా తేజ ఇండస్ట్రీలో పెద్ద.. పెద్ద స్టార్లతో కలిపి నటించాడు. ఇప్పుడు వాళ్లతో కలిసి పెద్ద మ్యాగజైన్ కవర్ పేజీలపై కనిపించడం రాబోయే యంగ్ స్టార్లకు స్ఫూర్తిదాయకమైన జర్నీగానే చెప్పుకోవచ్చు.

ఇక ఈ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీ మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో హీరో తేజ సరసన హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది.

Updated On 15 March 2023 7:34 AM GMT
Ehatv

Ehatv

Next Story