ప్రముఖ నటి తమన్నా భాటియాకు(Tamannaah Bhatia) మహారాష్ట్ర సైబర్ క్రైమ్(Maharastra Cyber Crime) పోలీసులు నోటిసులు() ఇచ్చారు. అంత నేరం ఆమె ఏం చేశారంటే నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్‌ప్లే యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ కారణంగా ఆమెను ఈ నెల 29వ తేదీన విచారణకు రావాలని పోలీసులు నోటీసులో ఆదేశించారు.
ప్రముఖ నటి తమన్నా భాటియాకు(Tamannaah Bhatia) మహారాష్ట్ర సైబర్ క్రైమ్(Maharastra Cyber Crime) పోలీసులు నోటిసులు(Summoned) ఇచ్చారు. అంత నేరం ఆమె ఏం చేశారంటే నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్‌లను(IPL Matches) ఫెయిర్‌ప్లే(Fair play) యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ కారణంగా ఆమెను ఈ నెల 29వ తేదీన విచారణకు రావాలని పోలీసులు నోటీసులో ఆదేశించారు. తమన్నా చేసిన ఈ పనివల్ల తమకు కోట్ల రూపాయలలో నష్టం వచ్చిందని ప్రసార హక్కులు కలిగిన వయాకమ్ ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో సీనియర్ నటుడు సంజయ్ దత్‌కు (Sanjay Dutt) కూడా పోలీసులు నోటీసులిచ్చారు. ఈ నెల 23వ తేదీన సంజయ్‌దత్ విచారణకు హాజరుకావాల్సి ఉండాలి. కానీ ఆ రోజున ఆయన దేశంలో లేనని పేర్కొవడంతో తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోవడానికి మరో రోజును సూచించాలని సంజయ్‌దత్ పోలీసులను కోరారు.