ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు నటుడు సూర్య(Surya). ఆయన నటించనున్న వాడివాసల్‌(Vadivasal) సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. సూర్య హీరోగా వెట్రిమారన్‌(Vetri Maran) దర్శకత్వంలో కలైపులి(KalaiPuli) ఎస్‌.థాను నిర్మించనున్న చిత్రం వాడివాసల్‌. జల్లికట్టు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇంతకు ముందే రిహార్సల్స్‌ నిర్వహించారు.

ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు నటుడు సూర్య(Surya). ఆయన నటించనున్న వాడివాసల్‌(Vadivasal) సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. సూర్య హీరోగా వెట్రిమారన్‌(Vetri Maran) దర్శకత్వంలో కలైపులి(KalaiPuli) ఎస్‌.థాను నిర్మించనున్న చిత్రం వాడివాసల్‌. జల్లికట్టు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇంతకు ముందే రిహార్సల్స్‌ నిర్వహించారు. ఇక సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న సమయంలో దర్శకుడు వెట్రిమారన్‌ హాస్యనటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ విడుదలై -1 సినిమా చేయడానికి వెళ్లారు. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తెరకెక్కించారు. మొదటి భాగం ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత సూర్య హీరోగా నటించే వాడివాసల్‌ చిత్రాన్ని మొదలు పెడతారని ప్రచారం జరిగింది. అయితే విడుదలై పార్ట్‌ టూ సినిమాపై దృష్టి సారిస్తున్నారట వెట్రిమారన్‌.

నిజానికి విడుదలై–2 చిత్రం చిన్నచిన్న ప్యాచ్‌ వర్క్‌ మినహా పూర్తయిందని చిత్ర వర్గాలు ప్రకటించాయి. విడుదలై చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో దాని సీక్వెల్‌ను ఇంకా బెటర్‌మెంట్‌ కోసం దర్శకుడు వెట్రిమారన్‌ పలు మార్పులు చేర్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చిత్రీకరణ నాలుగైదు రోజుల్లో ముగుస్తుందనుకుంటే 40 రోజులపైనే పట్టిందట. తొలి భాగం విజయవంతం కావడంతో రెండవ భాగంలో మార్పులు చేర్పులు చేయడానికి నిర్మాత అంగీకరించారు. పైగా ఖర్చు కూడా పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా చిత్రం చేస్తున్నారు సూర్య. వాడివాసల్‌ సినిమా సెట్‌పైకి వెళ్లాడానికి ఇంకా సమయం పట్టనుండడంతో, ఈలోపు మరో చిత్రం చేయాలని సూర్య నిర్ణయించుకున్నట్లు సమాచారం. సుధా కొంగర(sudha Kongara) దర్శకత్వంలో సూర్య మరోసారి నటించనున్నట్లు తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు సూరరై పోట్రు(Surarai Potrru) , తెలుగులో ఆకాశం నీ హద్దురా వంటి సూపర్‌హిట్‌ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

Updated On 12 Jun 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story