ఒకప్పుడేమోకానీ ఇప్పుడైతే ఇండియన్ సినిమాలపై మిగతా దేశాల ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకు ముందు ఓ భాషలో నిర్మించిన పెద్ద హీరో సినిమాలు మాత్రమే ఇతర భాషలలో డబ్ అయ్యేవి. ఆ తర్వాత ద్విభాష చిత్రాలు మొదలయ్యాయి. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీయడం ఎక్కువయ్యింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక భాషలో సినిమా తీస్తే పెద్దగా లాభాలు రావడం లేదు.
ఒకప్పుడేమోకానీ ఇప్పుడైతే ఇండియన్ సినిమాలపై మిగతా దేశాల ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకు ముందు ఓ భాషలో నిర్మించిన పెద్ద హీరో సినిమాలు మాత్రమే ఇతర భాషలలో డబ్ అయ్యేవి. ఆ తర్వాత ద్విభాష చిత్రాలు మొదలయ్యాయి. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీయడం ఎక్కువయ్యింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక భాషలో సినిమా తీస్తే పెద్దగా లాభాలు రావడం లేదు. అందుకే అయిదారు భాషలలో సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళ హీరోలు తెలుగులో కూడా సినిమాలు తీస్తూ సక్సెసయ్యారు. విజయ్, ధనుష్, కార్తీ వంటి హీరోలు ద్విభాష సినిమాలు తీస్తూ వెళుతున్నారు. గతంతో వర్మ తీసిన రక్తచరిత్ర అనే తెలుగు సినిమాలో సూర్య(Surya) నటించాడు. అయితే ఆ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. కాకపోతే సూర్య నటించిన చాలా తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ(Kanguva) సినిమా పది భాషలలో విడుదల అవుతున్నది. ఆ తర్వాత సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్నారు.లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నారట! సూర్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో చిత్రం రూపొందడం నిజమే అయితే అది పక్కా మాస్ మసాలా చిత్రంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. నిజంగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య సినిమా చేయాలనుకుంటే మాత్రం ఆయన పొరపాటు చేస్తున్నట్టే అనుకోవాలి. ఎందుకంటే బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. పైగా అతడు బాలకృష్ణతో మాత్రమే హిట్లు ఇచ్చాడు. మరో హీరోలతో పెద్దగా హిట్లు లేవు. రామ్‌చరణ్‌తో(Ram charan) తీసిన వినయ విధేయ రామ(Vinaya videya Rama) సినిమా ఎంత పెద్ద డిజాస్టరో కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. పైగా సూర్య వంటి వర్సటైల్ నటుడు పక్కా మాస్ మసాల సినిమాలు తీసే బోయపాటి సినిమాలో నటించడమేమిటని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు రామ్‌తో బోయపాటి చేసిన స్కంద సినిమాకు కూడా పెద్దగా బజ్ లేదు. బోయపాటి నుంచి వచ్చే ఏ సినిమా అయినా ట్రైలర్ పెద్ద సంచలనమే క్రియేట్ చేస్తుంది. కానీ స్కంద ట్రైలర్ చూసిన మెజారిటీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సినిమా విడుదల తర్వాత అభిప్రాయం మారవచ్చేమో చూడాలి. స్కంద హిట్ అయితే సూర్య సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. లేకపోతే సూర్య కూడా పునారాలోచనలో పడటం గ్యారంటీ.