నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురయ్యారు. గురువారం ఆయన ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నారు.
నటుడు శ్రేయాస్ తల్పాడే(Shreyas Talpade) గుండెపోటు(Heart Attack)కు గురయ్యారు. గురువారం ఆయన ముంబై(Mumbai)లో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకోగానే కుప్పకూలిపోయాడు. దీంతో అతడి భార్య దీప్తి(Deepthi) వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత అతడి పరిస్థితి నిలకడగా ఉంది.
'శ్రేయాస్ తల్పాడే రోజంతా షూట్‌లో పాల్గొన్నాడు.. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అతడు సెట్‌లో అందరితో సరదాగా ఉన్నాడు. షూట్ సమయంలో యాక్షన్ సన్నివేశాలలో కూడా పాల్గొన్నాడు. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లి తన భార్యకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు.
దీంతో అతడి భార్య ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా.. అతడు మార్గమధ్యంలో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి చేరుకోగానే వైద్యులు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. తల్పాడే యాంజియోప్లాస్టీ చేయించుకుని ప్రస్తుతం ప్రమాదం నుండి బయటపడ్డాడు. శ్రేయాస్ తల్పాడే హిందీ(Hindi), మరాఠీ(Marathi) సినిమాల్లో నటించాడు. 47 ఏళ్ల శ్రేయాస్ తల్పాడే రెండు దశాబ్దాల కెరీర్‌లో 45కి పైగా సినిమాలు చేశాడు. అతడు ప్రస్తుతం వెల్‌కమ్-3(Welcome to the Jungle)లో కనిపించనున్నాడు.