టాలీవుడ్‌ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) ఈ మధ్యనే ఓ ఇంటివాడయ్యాడు. ఈనెల 3 న శర్వానంద్‌-రక్షితారెడ్డి (SharwaNand - Rakshita) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం రాజస్థాన్ లోని పాలెస్ లో గ్రాండ్ గా జరిగిది. అయితే అతికొద్దిమంది బంధువులు, స్నేహితుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరగడంతో.. అటు కంప్లీట్ గా ఫ్యామిలీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కవర్ అయ్యేలా.. శర్వానంద్‌ ఫ్యామిలీ జూన్‌ 9న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించనుంది.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈరోజు తెలంగాణ సీఎం కేసిఆర్ ను కలిశారు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడంతో పాటు.. పెళ్ళి రిసెప్షన్ కు ఆహ్వానించారు.

టాలీవుడ్‌ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) ఈ మధ్యనే ఓ ఇంటివాడయ్యాడు. ఈనెల 3 న శర్వానంద్‌-రక్షితారెడ్డి (SharwaNand - Rakshita) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం రాజస్థాన్ లోని పాలెస్ లో గ్రాండ్ గా జరిగిది. అయితే అతికొద్దిమంది బంధువులు, స్నేహితుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరగడంతో.. అటు కంప్లీట్ గా ఫ్యామిలీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కవర్ అయ్యేలా.. శర్వానంద్‌ ఫ్యామిలీ జూన్‌ 9న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించనుంది.

ఇక ఈ నేపథ్యంలో శర్వానంద్ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)ను కలిశారు. రిసెప్షన్‌కు రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందించారు శర్వానంద్‌. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో కొద్దిసేపు ముచ్చటించారు శర్వానంద్‌. ఈ ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రెండు రోజులపాటు పెళ్లి వేడుక జరిగింది. శర్వానంద్‌ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి రాంచరణ్‌, సిద్దార్థ్‌, అదితీరావు హైదరీతోపాటు కొంతమంది ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.

శర్వానంద్‌ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని కాగా.. శర్వానంద్‌ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ అప్ చేస్తున్నాడు.కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Updated On 9 Jun 2023 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story