బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖన్ (Salman Khan)కు బద్రత పెరిగింది. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్న క్రమంలో.. ప్రభుత్వంతో పాటు సల్మాన్ ఖన్ కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ (Private Security) ఏర్పాటు చేసుకున్నారు. ఈక్రమంలో ఆయన సెక్యూరిటీలోకి బుల్లెట్ ఫ్రూప్ వాహనం చేరింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖన్ (Salman Khan)కు బద్రత పెరిగింది. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్న క్రమంలో.. ప్రభుత్వంతో పాటు సల్మాన్ ఖన్ కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ (Private Security) ఏర్పాటు చేసుకున్నారు. ఈక్రమంలో ఆయన సెక్యూరిటీలోకి బుల్లెట్ ఫ్రూప్ వాహనం చేరింది.
చాలా కాలంగా రకరకాల కేసులు ఫేస్ చేస్తూ వస్తున్నాడు.. బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్. ముఖ్యంగా కృష్ణజింకల (Black buck) కేసులో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. బిష్ణోయ్ తెగకు చెందిన వారు ఆయనపై పగబట్టి మరీ చంపుతామంటూ తిరుగుతున్నారు. ఈక్రమంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. సల్మాన్‌ను హత్యచేయడానికి కూడా ప్రయత్నించాడు. ప్రస్తతుం జైల్లో ఉన్న ఆయన సల్మాన్‌ను ఎలాగైనా చంపుతామంటూ.. పబ్లిక్‌గానే వార్నింగ్ ఇస్తున్నాడు. ఈక్రమంలో సల్మాన్ ఖాన్‌కు ప్రభుత్వం ప్రత్యేకంగా బద్రత ఏర్పాటు చేయగా.. దాన్ని ఎప్పటికప్పుడు ఇప్రూ చేస్తున్నారు.
ఇక సల్మాన్ ఖన్ బద్రతలో భాగంగా.. ఆయనకు బుల్లెట్ ప్రూప్ కారు (bullet proof car) వచ్చి చేరింది. ఈ కారును సల్మాన్ ఖాన్ స్వయంగా కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ ఎస్‌యూవీని సల్మాన్ కొనుగోలు చేశాడు. పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ అయిన నిస్సన్ పెట్రోల్ ఎస్‌యూవీ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. దేశంలో ఈ కారును నిస్సన్ కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. దక్షిణాసియా మార్కెట్‌లో మోస్ట్ పాపుల్ ఎస్‌యూవీ అయిన ఈ కారుచాలా ఖరీదు ఉంటుంది.
ఇప్పటికే ప్రభుత్వం నుంచి సల్మాన్ ఖాన్‌కు భారీ భద్రత ఉంది. ఆయన ఇంటి దగ్గర ముంబై పోలీసులు (Mumbai Police) భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎస్సై స్థాయి అధికారులు, దాదాపు 10 మంది కానిస్టేబుళ్లు రోజు షిప్ట్‌ల ప్రకారం.. సల్మాన్ ఇంటి దగ్గర సెక్యూరిటీగా విధుల్లో ఉంటున్నారు. బాంద్రాలోని సల్మాన్ ఇంటితో పాటు.. ఆయన ఆఫీసుకు కూడా భద్రత కల్పించారు. అంతే కాదు సల్మాన్ (Salman Khan) కనిపిస్తే.. జనం గుమ్మిగూడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇక సల్మాన్‌ను లారెన్స్ బిష్షోయ్ గ్యాంగ్ చంపుతామని బెదిరించడంతో .. పలువరిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే గ్యాంగ్‌స్టర్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారికాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఆ వన్యప్రాణులను వేటాడం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) వ్యాఖ్యానించాడు. తమ కులదైవానికి మెక్కి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.