రష్మిక మందన్న (Rashmika Mandanna) రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ల బ్రదర్ ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)తో చాలా క్లోజ్‌గా ఉంటుంది. తాజాగా ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ (Baby) సినిమా ఈవెంట్‌కు రష్మిక హాజరైన ‘ప్రేమిస్తున్నా’ అనే సాంగ్‌ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె స్టేజిపై మాట్లాడుతుండగా.
రష్మిక మందన్న (Rashmika Mandanna) రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ల బ్రదర్ ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)తో చాలా క్లోజ్‌గా ఉంటుంది. తాజాగా ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ (Baby) సినిమా ఈవెంట్‌కు రష్మిక హాజరైన ‘ప్రేమిస్తున్నా’ అనే సాంగ్‌ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె స్టేజిపై మాట్లాడుతుండగా.. అభిమానులు హిందీలో బాబీ అని.. ఇంగ్లిషులో సిస్టర్ ఇన్లా అని మీనింగ్ వచ్చేలా వదినా అంటూ నినాదాలు చేశారు.
రష్మిక మందన్న (Rashmika Mandanna) మాట్లాడటానికి స్టేజీ ఎక్కుతుండగా, అభిమానులు వదినా.. వదినా.. అంటూ కేకలు పెడుతుండటంతో ఇన్‌డైరెక్ట్‌గా విజయ్ దేవరకొండ పేరు చెప్పి ఆమెను టీజ్ చేశారు. థియేటర్లో అందరూ అరుస్తుండటం గమనించిన ఈ బ్యూటీ కాసేపు ఆమె తన స్పీచ్‌ను ఆపేసింది. అభిమానులు వదినా.. వదినా.. అంటుంటే ఆమె నవ్వుతూ అలా వదిలేసింది. ఇదిలా ఉంటే ఆ స్టేజిపై రష్మిక కోసం డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి ‘నీ నీలి కన్నుల్లోన’ అనే సాంగ్ పాడి డెడికేట్ చేశాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఆ తర్వాత ఆమె అందరినీ నవ్వించింది.
ఇక గీత గోవిందం, డియర్ కామ్రేజ్ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడంతో వీళ్లిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని రూమర్ క్రియేట్ అయింది. దీనికితోడు వీళ్లిద్దరూ టూర్స్‌లో కనిపించడంతోపాటు డిన్నర్లు, ఫ్యామిలి గెట్ టు గెదర్లూ అంటూ కనిపించడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఇక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.
ఇక రష్మిక విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న పుష్ప: ది రూల్ సినిమాలో శ్రీవల్లి అనే క్యారెక్టర్ చేస్తుంది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు. ఆ తర్వాత శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్‌తో కలిసి ‘ రెయిన్ బో’ అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. భీష్మ చిత్రం తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ల లో VNRTrio అనే సినిమా తెరకెక్కుతోంది.