నటకిరీటి రాజేంద్రప్రసాద్(Rajendra Prasad)నటించిన ఓటిటి మూవీ(OTT Films) సేనాపతి బాలీవుడ్ లైఫ్ అవార్డ్స్(Bollywood Life Awards)లో ఓటిటి కేటగిరిలో ఉత్తమ ఓటిటి ఫిల్మ్‌గా పురస్కారాన్ని గెలుచుకుంది. సేనాపతి(Senapathi) చిత్రం రాజేంద్రుడి విభిన్నమైన పాత్రపోషణ, విలక్షణమైన అభినయం రెండూ కలసి సేనాపతి విజయానికి చెప్పలేనంతగా దోహదపడింది.
నటకిరీటి రాజేంద్రప్రసాద్(Rajendra Prasad)నటించిన ఓటిటి మూవీ(OTT Films) సేనాపతి బాలీవుడ్ లైఫ్ అవార్డ్స్(Bollywood Life Awards)లో ఓటిటి కేటగిరిలో ఉత్తమ ఓటిటి ఫిల్మ్‌గా పురస్కారాన్ని గెలుచుకుంది. సేనాపతి(Senapathi) చిత్రం రాజేంద్రుడి విభిన్నమైన పాత్రపోషణ, విలక్షణమైన అభినయం రెండూ కలసి సేనాపతి విజయానికి చెప్పలేనంతగా దోహదపడింది. ఓటిటిలో యాభై రోజులపాటు, ఏకధాటిగా ప్రదర్శితమవుతూ విమర్శకుల అభినందనలను, ప్రేక్షకుల నీరాఉనాలను సేనాపతి అప్రతిహతంగా కొనసాగుతోంది. దక్షిణాది భాషలలో వచ్చిన మరే ఇతర భాషా చిత్రం కూడా సేనాపతి ముందు నిలబడలేకపోయాయి.
మొదటగా విడుదలైనప్పుడే సేనాపతి చిత్రంలో రాజేంద్రప్రసాద్ చేసిన పెరఫారమెన్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాకుండా, అందరినీ కట్టిపడేసింది. టైటిల్ క్యారెక్టర్లో రాజేంద్రప్రసాద్ రాణించిన విధానమే సేనాపతికి అంతటి ఫాలోయింగ్ తెచ్చిందని సోషల్ మీడియా కోడై కూసింది. ఇటీవలి రోజులలో రాజేంద్రుడు చేస్తున్న సినిమాలు, పోషిస్తున్న పాత్రలు వేటికవే భిన్నవిభిన్నమైనవిగా ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్న వైనం అందరినీ అబ్బురపరుస్తోంది. రచయితలు ఆయన కోసం ప్రత్యేకమైన, వైచిత్రి గల పాత్రలను సరికొత్తగా రాస్తున్నారు. ఆ నలుగురు, శ్రేయోభిలాషి, తోలబొమ్మలాట వంటి చిత్రాలు అందుకు సజీవ, దృశ్యరూపక సాక్ష్యాలుగా నిలుస్తాయని చెప్పడం అతిశయోక్తి కానేకాదు.
కామెడీని కామెడీగా మాత్రమే పోషించగలిగారు కొమ్ములు తిరిగినవారు సైతం. కానీ కామెడీకి కమర్షియల్ హీరోయిజమ్ స్టేటస్‌ను ఆపాదించిన ప్రత్యేకత, సార్ధకత తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాదు, యావద్భారతదేశంలోనే నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కి మాత్రమే దక్కుతుంది. దక్కింది. కేవలం ప్రతిభాపాటవాలతో మాత్రమే ఎదిగి, చిన్నచిన్నవేషాలను అద్భుతంగా పోషించి, అంచెలంచెలుగా హీరోగా ఉన్నతస్థాయికి చేరుకున్న రాజేంద్రప్రసాద్ ఈ తరం దర్శకులకి ఓ గొప్పవరంగా పరిణమించారు. రాజేంద్రప్రసాద్ లేకుండా ఏ దర్శకుడూ కథని రాసుకోవడం లేదు. సినిమా రూపకల్పనకు పూనుకోవడంలేదు.
హీరోలతో సరిసమానమైన పాత్రలను రాజేంద్రుడి గురించి తపన పడి మరీ సృష్టించి, తమ విజయాలకు నటకిరీటిని బాసటగా నిలుపుకుంటున్నారు. ధియేటర్ రిలీజులైనా, ఓటిటి స్ట్రీమింగ్ అయినా సరే, రాజేంద్రప్రసాద్‌కి తిరుగులేని విధంగా ఆయన పాత్రలు పండుతున్నాయి. అవి పండే విధంగా రాజేంద్రప్రసాద్ తన ప్రతిభను ధారబోస్తున్నారు.