కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీని జస్టిస్ హేమా కమిటి(Justice hema committiee) నివేదిక కుదిపేస్తున్నది.
కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీని జస్టిస్ హేమా కమిటి(Justice hema committiee) నివేదిక కుదిపేస్తున్నది. పలువురు ప్రముఖులు లైంగిక వేధింపుల(Sexual harrasment) ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ వ్యవహారం(drugs) తెరమీదకు వచ్చింది. గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాశ్(OM Prakash) నిర్వహించిన ఓ డీజే పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్టు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఆ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌పై ఇప్పటికే దాదాపు 30 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇతడితో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు సన్నిహితంగా ఉన్నారని తెలిసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన ఓ పార్టీలో ఓం ప్రకాశ్, అతడి ఫ్రెండ్ షిహాస్ డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, విక్రయించారట కూడా! పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. వారిని విచారించినప్పుడు మలయాళ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిసింది. అయితే, కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. దాంతో ఓం ప్రకాశ్, అతడి ఫ్రెండ్ షిహాస్‌కు బెయిల్ వచ్చింది. మజుమ్మెల్ బాయ్స్ సినిమాలో గుహ లోయలో పడిపోయిన పాత్రలో నడించిన శ్రీనాథ్ భాసితో(Srinath bhasi) పాటు పిశాచి(Pishachi) చిత్రం ద్వారా ఆకట్టుకున్న ప్రయాగ మార్టిన్‌లకు(Prayaga martin) ఈ డ్రగ్స్‌తో లింక్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఓం ప్రకాశ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉన్నదట! చాలాసార్లు వీరిద్దరు అతని గదికి కూడా వెళ్లారట!