ప్రముఖ నటుడు, దర్శకుడు త్యాగరాజన్‌ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టారు ప్రశాంత్‌(Prashanth). 17 ఏళ్ల వయసులోనే వైగాసి పోరంతచ్చు(Vaigasi Poranthachu) అనే తమిళ సినిమాలో హీరోగా నటించారు. అనతి కాలంలోనే సౌత్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించినప్పటికీ తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు త్యాగరాజన్‌ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టారు ప్రశాంత్‌(Prashanth). 17 ఏళ్ల వయసులోనే వైగాసి పోరంతచ్చు(Vaigasi Poranthachu) అనే తమిళ సినిమాలో హీరోగా నటించారు. అనతి కాలంలోనే సౌత్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించినప్పటికీ తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించారు. శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన జీన్స్(Jeans) సినిమా ఆయన కెరీర్‌ బెస్ట్‌గా నిలిచింది. అజిత్, విజయ్ వంటి హీరోలు కెరీర్‌లో గుర్తింపు పొందుతున్న సమయంలో ప్రశాంత్‌కు వారికి మించిన గుర్తింపు ఉండేది.

భారీ సక్సెస్‌లతో దూసుకుపోతున్న సమయంలో తన భార్యతో వివాదాలు కెరీర్‌పై ప్రభావం చూపాయి. దానికి తోడు వరుస పరాజయాలతో స్టార్‌డమ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. విడాకుల సమయంలో వచ్చిన వివాదాల వల్ల ప్రశాంత్ కెరీర్ పాతాళానికి పడిపోయింది. తెలుగులో వినయ విధేయ రామ(Vinaya vidheya rama) చిత్రంలో రామ్‌ చరణ్‌కు అన్నగా, కలెక్టర్‌ పాత్రలో ప్రశాంత్‌ కనిపించారు. లేటెస్ట్‌గా తమిళ ప్రముఖ రాజకీయ, సినీ విశ్లేషకుడు కాంతరాజ్ ప్రశాంత్ గురించి తెలియని చాలా విషయాలు చెప్పారు. 'సినీ ఇండస్ట్రీలో ప్రతి పదేళ్లకు ఒకసారి మార్పులు వస్తూనే ఉంటాయి. కొంతమంది నటీనటులు మాత్రమే కాలంతో ముందుకు సాగగలుగుతున్నారు. నటనలో ప్రశాంత్‌కు ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు. ప్రశాంత్‌ తన తండ్రి త్యాగరాజ్ డైరెక్షన్‌లో అంధాగన్‌ సినిమా తీస్తున్నారు. ఇంతటితో ఆయన సినిమాలు చేయకపోవడమే మంచిది.

అతను వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిది. నేడు సినిమాలు మారిపోయాయి. అతనిలో గతంలో ఉన్న హీరోయిజం లేదు. ఇప్పుడు సినిమా బాగుంటేనే చూస్తారు. అంతేకాకుండా ప్రశాంత్ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అది ప్రశాంత్‌ సినీ కెరీర్‌పై భారీ ప్రభావం చూపాయి. వాటి తర్వాత ప్రశాంత్ సినిమాల నుంచి తప్పుకున్నాడు.' అని కాంతరాజ్ వివరించాడు. 2005లో బిజినెస్‌మ్యాన్‌ కూతురు గృహలక్ష్మితో ప్రశాంత్‌కు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే వివాహం జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి. మూడేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. వీరి మధ్య పెద్ద గొడవలు జరిగినట్లు సమాచారం. తర్వాత పుట్టింటికి వెళ్లిన గృహలక్ష్మికి ఓ పాప పుట్టింది. ఆ చిన్నారిని చూసేందుకు వెళ్లిన ప్రశాంత్‌ను గృహలక్ష్మి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు.

తన భార్యను తిరిగి పొందేందుకు ప్రశాంత్‌ కోర్టుకు కూడా వెళ్లాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఇంతలోనే మరో ఊహించని సంఘటన వారి జీవితంలో చోటు చేసుకుంది. హఠాత్తుగా నారాయణన్‌ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్‌ కంటే ముందే గృహలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. గృహలక్ష్మి తనను 1998లోనే వివాహం చేసుకున్నదన్నాడు.దీంతో విడాకుల కోసం ప్రశాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసింది. తన కూతురుని తన దగ్గర వదిలేయాలన్న ప్రశాంత్‌ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. విడాకుల సమయంలో వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రశాంత్ ఇమేజ్‌ను బాగా దెబ్బతీశాయి. ఇలా వెండితెర లైమ్‌లైట్‌లో కనిపించకుండా పోయాడు. ఆయనతో పాటు వచ్చిన అజిత్, విజయ్ లాంటి స్టార్లందరూ సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు.

Updated On 14 Aug 2023 7:30 AM GMT
Ehatv

Ehatv

Next Story