ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) వ్యవహారశైలిపై విలక్షణ నటుడు ప్రకాశ్‌ మరోసారి తనదైన రీతిలో రియాక్టయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) వ్యవహారశైలిపై విలక్షణ నటుడు ప్రకాశ్‌ మరోసారి తనదైన రీతిలో రియాక్టయ్యారు. ఏబీపీ స‌ద‌ర‌న్ రైజింగ్ స‌మ్మిట్‌లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ప్రకాష్‌ రాజ్‌ సమాధానాలు ఇచ్చారు. ఇదే క్రమంలో పవన్‌కల్యాణ్‌ ప్రస్తావన తీసుకొచ్చారు న్యూస్‌ యాంకర్‌. పవన్‌ అంటే మీకు ఎందుకంత కోపం అని నేరుగా అడిగేశారు. దానికి ప్రకాశ్‌రాజ్‌ వివరంగా సమాధానమిచ్చారు. 'పవన్‌ కల్యాణ్‌ మూర్ఖత్వంగా రాజకీయాలు చేస్తున్నాడు. విధ్వంస రాజకీయం చేస్తున్నాడు. అది నాకు నచ్చడం లేదు. అది మాత్రమే చెబుతున్నాను. ప్రజలు ఆయన్ను ఎన్నుకుంది ఇలాంటి పాలిటిక్స్‌ కోసం కాదు కదా? ప్రజల తరుపున పవన్‌‌ని అడిగేవారు కూడా ఉండాలి కదా! మతం(Relegion) పేరుతో రాజకీయం చేసి అయోధ్యలో(ayodhya) ఓడిపోయారు. ఇప్పుడు మన కొండ ఎక్కడానికి వచ్చారు. మతతత్వ రాజకీయాలు మన దక్షిణ భారతదేశంలో బలపడే అవకాశం ఉండదు' అని చెప్పుకొచ్చారు. పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తున్నానన్న కారణంగా తనకు సినిమా అవకాశాలు పోతాయన్న బెంగ లేదన్నారు. తనకు సినిమా ఛాన్సులు రాకుండా ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు.

సినిమాలు వస్తూనే ఉన్నాయని, పనిచేస్తూనే ఉన్నానని, ఎవరైనా ఆపగలరా అని ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నించారు. తన వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఇబ్బంది పడలేదని, సమాజంలో జరిగే త‌ప్పుల‌ను చూస్తూ నోరు మెద‌ప‌కుండా ఉండ‌లేనని తెలిపారు. ఒకవేళ తనకు సినిమా అవ‌కాశాలు కోల్పోయినా ప్ర‌శ్నించ‌డం మాత్రం ఆపనని ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు.

Eha Tv

Eha Tv

Next Story