తమిళ నటుడు ప్రభు(Prabhu) తెలుగు వారికీ కూడా సుపరిచితులే. డార్లింగ్(Darling), ఒంగోలు గిత్త(Ongolu Githa), దేనికైనా రెడీ(Dhenikaina Ready) వంటి సినిమాల్లో నటించి ఇక్కడ ఆడియన్స్ ని కూడా అలరించారు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభు.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈయన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ‘విక్రమ్ ప్రభు’(Vikram Prabhu) హీరోగా తమిళ పరిశ్రమలో కొనసాగుతున్నారు. కాగా ప్రభుకి ఒక కూతురు కూడా ఉన్నారు.

Aishwarya Prabhu
తమిళ నటుడు ప్రభు(Prabhu) తెలుగు వారికీ కూడా సుపరిచితులే. డార్లింగ్(Darling), ఒంగోలు గిత్త(Ongolu Githa), దేనికైనా రెడీ(Dhenikaina Ready) వంటి సినిమాల్లో నటించి ఇక్కడ ఆడియన్స్ ని కూడా అలరించారు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభు.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈయన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ‘విక్రమ్ ప్రభు’(Vikram Prabhu) హీరోగా తమిళ పరిశ్రమలో కొనసాగుతున్నారు. కాగా ప్రభుకి ఒక కూతురు కూడా ఉన్నారు. ఆమె పేరు ఐశ్వర్య(Aishwarya). ఈమె ఒక స్టార్ దర్శకుడిని పెళ్లాడబోతుందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఐశ్వర్యకి 2009లో వివాహం జరిగింది. తన బంధువుల కుటుంబంలోని వ్యక్తిని పెళ్లాడిన ఐశ్వర్య.. భర్తతో కలిసి అమెరికా వెళ్లి జీవించారు. కానీ అతనితో విబేధాలు రావడంతో ప్రస్తుతం అతని నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు. కాగా గత కొంత కాలంగా తమిళనాట ఒక రూమర్ వినిపిస్తుంది. ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) తో ప్రేమలో ఉన్నారని త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా విశాల్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’(Mark antony) డైరెక్ట్ చేసింది అధిక్ రవిచంద్రనే.
రవిచంద్రన్, ఐశ్వర్య మంచి స్నేహితులయ్యారని, అది కాస్త ప్రేమగా మరి ఇప్పుడు ఏడడుగులు వేయడానికి సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఒక వార్త తమిళనాట వైరల్ అవుతుంది. ఆల్రెడీ వీరిద్దరి నిశ్చితార్థం జరిగిపోయిందని, డిసెంబర్ 15న వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారని చెబుతున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే.. ప్రభు కుటుంబసభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
