సీరియల్ నటుడు ప్రభాకర్(Prabhakar) బుల్లితెర హీరోగా పేరు సంపాదించుకున్నాడు.
సీరియల్ నటుడు ప్రభాకర్(Prabhakar) బుల్లితెర హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇతనిని బుల్లితెర మెగాస్టార్ అని కూడా అంటారు. సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపుపొందాడు. పలు సీరియల్స్‌కు నిర్మాతగా కూడా ప్రభాకర్ వ్యవహరించారు. సీరియల్స్‌లో సక్సెస్ సాధించిన ప్రభాస్.. తన కొడుకు విషయంలో ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన అనుకున్నంత సక్సెస్ కాలేకపోతున్నాడు. తన కొడుకుకు చాలా టాలెంట్ ఉందని.. ఏరోజైనా సినిమాల్లో రాణిస్తాడని ఆయన నమ్మకం.
ఈ మధ్యనే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్(Chandrahas) నటించిన రామ్‌నగర్ బన్నీ(Ram nagar bunny) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్నంత ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ప్రభాకర్ అసంతృప్తిగా ఉన్నాడు. సినిమా ఎంత బాగున్నా కానీ ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి చూడలేదన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు సినిమా ఆడకపోవడానికి జూ.ఎన్టీఆరే(Jr NTR) కారణమన్నారు. తన కొడుకు చంద్రహాస్ సినిమాలలో నటించాలని ఉందన్న విషయం తనకు చెప్పగానే నటనలో ట్రెయినింగ్ ఇప్పించానని తెలిపారు. నటన పట్ల చంద్రహాస్‌కు ఉన్న ప్యాషన్ చూసి చాలా మంది నిర్మాతలు ముందుకు వచ్చారన్నారు. రెండు కమర్షియల్ సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. అయితే రామ్నగర్ బన్నీ అనే సినిమా కథ నచ్చి తానే ఆ సినిమాకు నిర్మాతగా ఉండాలనుకున్నానని చెప్పారు. అయితే బడ్జెట్ 2 కోట్లు అనుకుంటే అది కాస్త 5 కోట్ల వరకు వెళ్లిందన్నారు. సినిమాకు మంచి టాక్ వచ్చినా కానీ కలెక్షన్లలో వెనుకబడ్డానన్నారు. జూ.ఎన్టీఆర్ నటించిన దేవర(Devara) సినిమా విడుదల కావడంతో ప్రేక్షకులు అందరూ దేవర సినిమా చూసేందుకే మొగ్గు చూపారన్నారు. దీంతో రామ్‌నగర్ బన్నీ సినిమాకు అనుకున్నంత కలెక్షన్లు రాలేదని ఆవేదన చెందారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.