ప్రాణం ఉన్నంత వరకు మేలు మర్చిపోను

ఈ రోజు మెగాస్టార్‌ చిరంజీవి(chiranjeevi) అభిమానులకు పండుగ రోజు. తమ అభిమాన నటుడి జన్మదిన(Birthday) వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని సుదూర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు హైదరాబాద్‌కు వచ్చారు. అలా నటుడు పొన్నాంబళం(Ponnambalam) కూడా చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు.

చిరంజీవి బర్త్‌డే వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. చిరు పుట్టిన రోజు వేడుకలకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన చిరంజీవి గొప్ప మనసును కొనియాడారు. ‘నేను ఇప్పటి వరకు 1500 సినిమాల్లో నటించాను. ఘరానా మొగుడు హిట్ అవకపోతే నేను ఇండస్ట్రీ వదిలేస్తాను అని అప్పుడు చెప్పాను. 1985- 86 రోజుల్లో మాకు పారితోషికం రోజుకు 350 రూపాయలు ఇచ్చేవారు. చిరంజీవి సినిమా షూటింగ్‌ ఉన్నప్పుడు మాత్రం ఫైటర్స్‌కి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయిలు చొప్పున ఇచ్చేవారు. నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని తెలిసి చిరంజీవి ఇప్పటివరకు 60 లక్షల రూపాయలకు పైగానే ఖర్చు చేశారు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అది చిరంజీవి గారి చలవే. ఈ జీవితం ఆయన ఇచ్చిందే' అంటూ పొన్నాంబళం భావోద్వేగానికి లోనయ్యారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు తాను నమ్ముకున్నవాళ్లెవరూ సాయం చేయలేదని పొన్నాంబళం చాలా సార్లు చెప్పారు. చిరంజీవి కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు. చిరంజీవి నటించిన ఘ‌రానా మొగుడు, ముగ్గురు మొన‌గాళ్లు వంటి సినిమాల్లో పొన్నాంబళం విలన్‌ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పుట్టిన రోజు సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి తిరుమల వెళ్లారు.

Eha Tv

Eha Tv

Next Story