బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty) మొన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోల్‌కతా(Kolkata)లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty) మొన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోల్‌కతా(Kolkata)లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిథున్ చక్రవర్తికి మెదడుకు సంబంధించిన ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్(Ischemic Cerebrovascular Stroke) వచ్చిందని వైద్య పరీక్షలో తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అసలు ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ అంటే ఏమిటీ? ఎందువల్ల ఇది వస్తుంది? అంటే మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా జరగకపోయినా లేదా తగ్గినా ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ కారణంగా మెదడు కణజాలానికి ఆక్సిజన్ వంటి పోషకాలు అందవు. వెంటనే మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం మొదలవుతుంది. ఆ తర్వాత పేషంట్ పరిస్థితి విషమంగా మారుతుంది. మెదడుకు సంబంధించినదే మరో వ్యాధి బ్రెయిన్ హెమరేజిక్ స్ట్రోక్. మెదడులోని రక్తనాళం లీక్ అయినప్పుడు లేదా పగిలిపోయి మెదడులో రక్తస్రావం జరిగితే బ్రెయిన్ హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. చాలమంది ఎదుర్కొనే స్ట్రోక్ ఇది. అయితే ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది మాత్రం చాలా అరుదుగా వస్తుందని చెప్పొచ్చు. ఇది క్రిటికలేనని చెప్పవచ్చు! స్ట్రోక్ వచ్చినవారు మాట్లాడలేరు. ఇతరులు చెప్పింది కూడా అర్థం చేసుకోలేరు. ముఖం, చేతులు, కాళ్లకు తిమ్మిరి పట్టేస్తాయి. పక్షవాతం వచ్చినా రావచ్చు. కళ్లలో కూడా సమస్యలు వస్తాయి. విపరీతమైన తలనొప్పి వస్తుంది. సరిగ్గా నడవలేరు. ఈ స్ట్రోక్ వస్తే ఆలస్యం చేయకూడదు. వెంటనే చికిత్స చేయాల్సి వుంటుంది. తక్షణ వైద్య సహాయం అందకపోతే మాత్రం మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.