తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల(Manobala) కన్నుమూశారు. 69 ఏళ్ల మనోబాల 1953, డిసెంబర్ 8న జన్మించారు. ఏడో దశకంలోనే తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ప్రముఖ నటుడు కమలహాసన్ సిఫార్సుతో దిగ్దర్శకుడు భారతీరాజాకు సహాయకుడిగా చేరారు. 1979లో వచ్చిన పుదియవార్పుగల్ ఈయన మొదటి సినిమా. అందులో పంచాయతీ మెంబర్‌గా కాసేపు కనిపిస్తారు కూడా!
తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల(Manobala) కన్నుమూశారు. 69 ఏళ్ల మనోబాల 1953, డిసెంబర్ 8న జన్మించారు. ఏడో దశకంలోనే తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ప్రముఖ నటుడు కమలహాసన్ సిఫార్సుతో దిగ్దర్శకుడు భారతీరాజాకు సహాయకుడిగా చేరారు. 1979లో వచ్చిన పుదియవార్పుగల్ ఈయన మొదటి సినిమా. అందులో పంచాయతీ మెంబర్‌గా కాసేపు కనిపిస్తారు కూడా! 1982లో దర్శకుడయ్యారు. దర్శకుడిగా ఈయన మొదటి సినిమా ఆగాయ గంగై! తమిళంలో పెక్కు సంఖ్యలో సినిమాలు రూపొందించిన మనోబాల కన్నడలో డిసెంబర్ 31, హిందీలో మేరా పతి సిర్ఫ్ మేరా హై సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. మూడు సినిమాలను నిర్మించారు. పలు సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో కూడా మనోబాల నటించారు. మనోబాల మృతి పట్ల తమిళ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.