హాలీవుడ్ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. నటుడు క్రిస్టియన్ ఆలివర్, అతని ఇద్దరు కుమార్తెలు మరణించారు. సమాచారం ప్రకారం..

హాలీవుడ్(Hollywood) నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. నటుడు క్రిస్టియన్ ఆలివర్(Christian Oliver), అతని ఇద్దరు కుమార్తెలు మరణించారు. సమాచారం ప్రకారం.. అతని విమానం టేకాఫ్ అయిన వెంటనే కరేబియన్ సముద్రం(Caribbean Sea)లో పడిపోయింది. "ది గుడ్ జర్మన్", 2008 యాక్షన్-కామెడీ "స్పీడ్ రేసర్"లో జార్జ్ క్లూనీతో కలిసి ఆలివర్ పెద్ద తెరపై కనిపించాడు. అతని మరణాన్ని రాయల్ సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ పోలీస్ ఫోర్స్(St Vincent and the Grenadines) ధృవీకరించాయి.

మీడియా నివేదికల ప్రకారం.. సంఘటన జరిగిన తరువాత మత్స్యకారులు, డైవర్లు, కోస్ట్ గార్డ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నుండి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను 51 ఏళ్ల ఆలివర్, అతని ఇద్దరు కుమార్తెలు మదిత (10 సంవత్సరాలు), అన్నీక్ (12 సంవత్సరాలు), పైలట్ రాబర్ట్ సాచ్‌లుగా గుర్తించారు.

గురువారం మధ్యాహ్నం తర్వాత విమానం గ్రెనడైన్స్‌లోని బెక్వియా నుండి సెయింట్ లూసియా(St Lucia)కు బయలుదేరినట్లు సమాచారం. నటుడు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆలివర్ ఇటీవ‌ల‌ ఇన్‌స్టాగ్రామ్‌(Insta)లో బీచ్ చిత్రాన్ని పోస్ట్ చేసి క్యాప్షన్‌లో ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year Wishes) తెలిపారు. ఒలివర్ కెరీర్ లో 60 కంటే ఎక్కువ చలనచిత్రాలలో, ప‌లు టీవీ షోలలో భాగమయ్యాడు.

Updated On 5 Jan 2024 10:58 PM GMT
Yagnik

Yagnik

Next Story