కమెడియన్ బ్రహ్మాజీ(Brahmaji).. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు.. తన కామెడీతో విలక్షణమైన నటనతో పేక్షకులకు ఎంతో ఇష్టమైన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే అలా మొదలైంది (Ala Modalaindi Show)షోకి అయన భార్యతో కలిసి గెస్ట్‌గా వచ్చారు. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబందించిన ప్రోమో విడుదల చేసింది టీమ్.

Actor Brahmaji
కమెడియన్ బ్రహ్మాజీ(Brahmaji).. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు.. తన కామెడీతో విలక్షణమైన నటనతో పేక్షకులకు ఎంతో ఇష్టమైన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే "అలా మొదలైంది" (Ala Modalaindi Show)షోకి అయన భార్యతో కలిసి గెస్ట్‌గా వచ్చారు. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబందించిన ప్రోమో విడుదల చేసింది టీమ్. ఈ షోకి వెన్నెల కిషోర్(Vennela Kishore) హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెల్సిందే.
ప్రేమ అనేది ఎంతో మధురమైనది... అంత ఈజీగా దొరకదు.. కొంత మంది టైమ్ పాస్ కోసం అమ్మాయితో తిరిగి దానికి ప్రేమ అని పేరు పెట్టి దాని పవిత్రతను చెడగొట్టారన్నారు బ్రహ్మాజీ.. తనకి ప్రేమ అంత ఈజీగా దొరకలేదని.. దాని వెనకాల సినిమా రేంజ్లో యాక్షన్ జరిగిందని తెలిపారు.. తమకు పెళ్లి చేసింది కృష్ణవంశీ(Krishna Vamsi) అని, ఇండస్ట్రీలో ఎంతో మంది తమ ప్రేమకు సపోర్ట్ చేశారన్నారు. అయితే ఈ ఎపిసోడ్లో మాత్రం భార్య డామినేషన్ ఎక్కువైంది.. వెన్నెల కిషోర్‌తో కలిసి బ్రహ్మజీని ఆడుకుంది భార్య శశ్వతి.. ప్రోమోలో తమ జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషాలు తెలిపారు.. ఈ ఫుల్ ఎపిసోడ్ మార్చ్ 2న టెలికాస్ట్ కానుంది.
