ఏప్పుడూ ఏడో ఒక కామెంట్స్ తో ట్రెండింగ్ లో ఉంటుంటాడు నటుడు బ్రహ్మాజీ(Brahmaji ). ఆయన సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు హైలెట్ అవుతుంటాయి. తాజాగా ఆయన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టిపై(Naveen Polishetty) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఏప్పుడూ ఏడో ఒక కామెంట్స్ తో ట్రెండింగ్ లో ఉంటుంటాడు నటుడు బ్రహ్మాజీ(Brahmaji ). ఆయన సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు హైలెట్ అవుతుంటాయి. తాజాగా ఆయన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టిపై(Naveen Polishetty) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చేసింది మూడు సినిమాలే అయినా.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తో పాటు.. మంచి సక్సెస్ రేట్ కూడా సాధించాడు నవీన్ పోలిశెట్టి. చేసిన మూడు సినిమాలు కూడా మంచి హిట్లుగా నిలిచి పోయాయి. తాజాగా స్టార్ సీనియర్ నటి అనుష్కతో(Anushka) కలిసి అద్భుతమైన సినిమా చేశాడు నవీన్. ఆ మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాతో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాలో నవీన్‌ నటన, కామెడీ టైమింగ్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు.

సామాన్య ప్రేక్షకుల నుంచి. . సెలబ్రిటీల వరకూ అంతా నవీన్ నటనకు ఫిదా అయిన వారే. తాజాగా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ నవీన్‌ నటన చూసి మొచ్చుకున్నాడు.అంతే కాదు తనదైన శేలిలో ఓ చిన్న వ్యాఖ్యలు చేసి.. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలో ఇంజనీరింగ్‌ గురించి చెప్పే ఓ డైలాగ్‌ను.. గతంలో నవీన్‌ కెరీర్‌ మొదట్లో ఇంజనీరింగ్‌ కష్టాలను ఉద్దేశించి చేసిన ఓ షార్ట్‌ ఫిలింలోని డైలాగ్‌ను కలిపి ఓ నెటీజన్‌ ఫన్నీగా వీడియోను క్రియేట్‌ చేశాడు. దానికి ఉత్తరాది లేదా దక్షిణాది.. ప్రాంతం ఏదైనా సరే నవీన్‌ పొలిశెట్టి ఇంజినీర్స్‌ వాయిస్‌ అని ట్వీట్‌ చేశాడు.

అంతే కాదు ఈ విషయంలో స్పందించిన నవీన్ సైతం ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఇదే వీడియోపై బ్రహ్మాజీ స్పందించి ..నవీన్‌కు ఉన్న టాలెంట్‌ చూస్తుంటే భయమేస్తుందని చెప్పుకొచ్చారు. ఫ్రస్ట్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌గా నవీన్‌ నటన చూసి ఫిదా అయ్యానని చెప్పాడు. అంతేకాకుండా ఇక, తాను రిటైర్‌మెంట్‌ తీసుకోవడం బెటర్‌ అంటూ సరదాగా ట్వీట్‌ వేశాడు.

Updated On 10 Oct 2023 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story