పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీనియర్ రచయిత, నటుడు పరుచూరి గోపాల కృష్ణ. పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలతో పాటు.. ఆయన కెరీర్ కు సబంధించి కొన్ని వ్యాక్యలు చేశారు. సమాజాన్ని మార్చాలన్న తపన...మార్చ గల సత్తా పవర్ స్టార్ కు ఉంది అన్నారు పరుచూరి. సమాజంలో మార్పు రావాలని పవర్ మనస్పూర్తిగా కోరకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.

సినీ నటుడు.. జనసేన(Janasena) అదినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు... టాలీవుడ్ సీనియర్ రచయిత, నటుడు పరుచూరి గోపాల కృష్ణ(Paruchuri Gopala Krishna). పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న పులి అన్నారు పరుచూరి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీనియర్ రచయిత, నటుడు పరుచూరి గోపాల కృష్ణ. పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలతో పాటు.. ఆయన కెరీర్ కు సబంధించి కొన్ని వ్యాక్యలు చేశారు. సమాజాన్ని మార్చాలన్న తపన...మార్చ గల సత్తా పవర్ స్టార్ కు ఉంది అన్నారు పరుచూరి. సమాజంలో మార్పు రావాలని పవర్ మనస్పూర్తిగా కోరకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.

అంతే కాదు సమాజం మారాలంటే..అధికారం అప్పుడప్పుడు చేతులు మారుతూ ఉండాలి..అది ఒక్కరి ఆధిపత్యంలోకి వెళ్ళకూడదు అన్నారు. అందుకే గతంలో పవర్ స్టార్ ఎలక్షన్ లో నిలబడ్డారన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.... మళ్ళీ దెబ్బతిన్న పులిలా మన ముందుకు వస్తారన్నారు పరుచూరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఈసారి ఏదైనా సాధించాలని చూస్తున్నాడు అని అన్నారు.

పాలిటిక్స్(Politics) లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి.. వాటిని లెక్క చేయకుండా ముందు సాగాలి.. ఓటింగ్ అనేది పెద్ద రాజకీయం తంత్రం. సమాజం గురించి రాజకీయ నాయుడు చెపితే వినేవారికంటే.. సినిమా వాళ్లు చెపితేనే వినేవారు ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ అంటే మొదటి నుంచీ తనకు ఎంతో ఇష్టం అన్నారు . పవన్ కళ్యాణ్ బాగుండదాలి అని కోరుకునే వ్యాక్తుల్లో తాను ముంద వరుసలో ఉంటాను అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ఇక పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సినిమాలు మానేయవద్దని అన్నారు. సినిమాలు రెగ్యూలర్ గా చేయడం ఇబ్బందిగా ఉన్నా.. ఎన్టీఆర్ మాదిరి అప్పుడప్పుడు అయినా సినిమాలు చేయాలని ఆయన అన్నారు. అంతే కాదు పవన్ అంటే తనకు ఎంతో ఇష్టం అని.. పవన్ కోరుకున్నది జరగాలని ఆయన ఆకాంక్షిచారు.

Updated On 10 Aug 2023 12:04 AM GMT
Ehatv

Ehatv

Next Story