రీసెంట్‏గా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన యాక్టర్, పొలిటికల్ లీడర్ ఖుష్భూ సుందర్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తన చిన్నతనంలో అంటే 8 ఏళ్ల వయస్సులో తన తండ్రి లైంగికంగా, శారీరకంగా వేధించినట్టు కమెంట్స్ చేసింది. చిన్నప్పుడు జరిగిన లైంగిక వేధింపుల బాధ జీవితాంతం వెంటాడుతుందని.. తన బాల్యం గురించి మనసులో బాధని బయటిపెట్టింది. అయితే 15 ఏళ్ల వయస్సు తర్వాత తండ్రిని ఎదిరించడం మొదలు పెట్టానని, 16 […]

రీసెంట్‏గా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన యాక్టర్, పొలిటికల్ లీడర్ ఖుష్భూ సుందర్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తన చిన్నతనంలో అంటే 8 ఏళ్ల వయస్సులో తన తండ్రి లైంగికంగా, శారీరకంగా వేధించినట్టు కమెంట్స్ చేసింది.

చిన్నప్పుడు జరిగిన లైంగిక వేధింపుల బాధ జీవితాంతం వెంటాడుతుందని.. తన బాల్యం గురించి మనసులో బాధని బయటిపెట్టింది. అయితే 15 ఏళ్ల వయస్సు తర్వాత తండ్రిని ఎదిరించడం మొదలు పెట్టానని, 16 ఏళ్ల వయస్సులో తమ కుటుంబాన్ని తండ్రి వదిలేసి వెళ్లాడని.. ఆ టైమ్‏లో కుటుంబం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందని చెప్పుకొచ్చింది ఖుష్భూ సుందర్.

తమిళనాడులో ఖుష్భూకు సూపర్ స్టార్డం ఉండటంతో పాటు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ రాష్ట్రంలో ఆమె కోసం అభిమానులు ఓ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆ తర్వాత డైరెక్టర్ సి. సుందర్‏ను ఖుష్భూ వివాహం చేసుకుంది.

ఇదిలా ఉంటే స్ట్రయిట్ ఫార్వాడ్ యాటిట్యూడ్ వలన ఆమె వివాదాల్లో కూడా చిక్కుకుంది. ఇక 2010లో DMK పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది ఖుష్భూ. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి.. 2020లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరింది ఖుష్భూ.

Updated On 6 March 2023 4:49 AM GMT
Ehatv

Ehatv

Next Story