తమిళ హీరో, బిచ్చగాడు(Bichagadu) ఫేమ్ విజయ్ ఆంటోనీ(Vijay Antony) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. 12వ తరగతి చదువుతున్న ఆయన కూతురు మీరా(Meera) ఆంటోని ఆత్మహత్య(Sucide) చేసుకుంది. తీవ్రమైన ఒత్తిడితోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని తెలుస్తోంది. అయితే అమ్మాయిని గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది.
తమిళ హీరో, బిచ్చగాడు(Bichagadu) ఫేమ్ విజయ్ ఆంటోనీ(Vijay Antony) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. 12వ తరగతి చదువుతున్న ఆయన కూతురు మీరా(Meera) ఆంటోని ఆత్మహత్య(Sucide) చేసుకుంది. తీవ్రమైన ఒత్తిడితోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని తెలుస్తోంది. అయితే అమ్మాయిని గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నైలోని అల్వార్‌పేటలోని డీడీకే రోడ్డులో నివాసముంటున్నాడు. విజయ్ ఆంటోనీ కూతురు 16 ఏళ్ల మీరా ఆంటోనీ చర్చ్ పార్క్ స్కూల్‌లో(Church Park School) 12వ తరగతి చదువుతోంది. అయితే చదువుల వల్లే ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. మీరా తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే తన గదిలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మీరాను గమనించిన కుటుంబసభ్యులు కావేరీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో విజయ్ ఆంటోని ఇంట్లో లేడని అంటున్నారు.