ఆదిపురుష్‌(adipurush) సినిమాను ఏ సమయంలో మొదలు పెట్టారేమో కానీ, మొదటి నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. ప్రారంభ ముహూర్తం బాగోలేనట్టుగా ఉంది. అందుకే రోజురోజుకీ వివాదాలు ఎక్కువవుతున్నాయి. వివాదాస్పదంగా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తొలగించాలంటూ కొందరు, సినిమాను పూర్తిగా నిషేధించాలని(Movie Ban) మరి కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆదిపురుష్‌(adipurush) సినిమాను ఏ సమయంలో మొదలు పెట్టారేమో కానీ, మొదటి నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. ప్రారంభ ముహూర్తం బాగోలేనట్టుగా ఉంది. అందుకే రోజురోజుకీ వివాదాలు ఎక్కువవుతున్నాయి. వివాదాస్పదంగా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తొలగించాలంటూ కొందరు, సినిమాను పూర్తిగా నిషేధించాలని(Movie Ban) మరి కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభాస్‌(Prabhas) రాముడిగా, కృతి సనన్‌(Kriti sanon) సీతగా, సైఫ్‌ అలీఖాన్‌(Saif Alikhan) రావణాసురుడిగా నటించిన ఈ సినిమాకు ఓం రౌత్‌(Om Raut) దర్శకత్వం వహించాడు. రామాయణం(Ramayanam) ఆధారంగా ఈ సినిమాను రూపొందించారన్న విషయం తెలిసిందే.

పాత్రల రూపకల్పన, సంభాషణలపై మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొందరు వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ధర్నాకు దిగారు. మధురలోని ఓ వర్గానికి చెందిన కొందరు ఆదిపురుష్‌ సినిమా పోస్టర్లను చించేశారు. థియేటర్ల ముందు బైఠాయించారు. హనుమంతుడితో చవకబారు సంభాషణలు చెప్పించారని, అర్థం పర్థం లేని సన్నివేశాలను సినిమాలో జొప్పించారని విమర్శిస్తున్నారు.

తమ మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సినిమాలోని సంభాషణలు వింటుంటే మా రక్తం మరిగిపోతోంది. రామాయణంలోని పాత్రల్ని ఉద్దేశపూర్వకంగానే ఇలా మలచినట్టుగా అర్థమవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని అయోధ్యలోని రామాలయ పూజారి ఒకరు అన్నారు. . ‘కొందరు రాజకీయ నాయకులు సమకూర్చిన డబ్బుతో.. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కొందరు దర్శక నిర్మాతలు చిత్రాలు తీస్తున్నారు.

ఇలాంటి రూపకర్తల వెనకాల ఉన్న రాజకీయ ఎజెండా ఏంటో సెన్సార్‌ బోర్డు పరిశీలించాలి’ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. మరోవైపు నేపాల్‌లో కూడా సినిమాపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆదిపురుష్‌ ప్రదర్శనను సోమవారం దేశవ్యాప్తంగా నిలిపివేశారు. దీంతో పాటు హిందీ సినిమాలను ప్రదర్శించకూడదనే నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో జానకి భారతీయ పుత్రిక అనే డైలాగుపై అక్కడి వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీతమ్మ ఈశాన్య నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించిందన్నది వారి విశ్వాసం.

Updated On 20 Jun 2023 5:45 AM GMT
Ehatv

Ehatv

Next Story