బుధవారం ఉదయం అమెరికాలోని ఫిల్మ్ కారిడార్ నుండి ఒక చేదు వార్త వెలువడింది. 'బ్లాక్ యాక్షన్ హీరో'గా ప్రసిద్ధి చెందిన నటుడు రిచర్డ్ రౌండ్‌ట్రీ(81) మరణించారు. ఆయన మరణానికి కారణం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని చెప్పారు.
బుధవారం ఉదయం అమెరికాలో(America)ని ఫిల్మ్ కారిడార్ నుండి ఒక చేదు వార్త వెలువడింది. 'బ్లాక్ యాక్షన్ హీరో'గా ప్రసిద్ధి చెందిన నటుడు రిచర్డ్ రౌండ్‌ట్రీ(Richard Roundtree) (81) మరణించారు. ఆయన మరణానికి కారణం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్(Pancreatic cancer) అని తెలుస్తుంది. 1971లో విడుదలైన 'షాఫ్ట్'(Shaft) సినిమాతో రిచర్డ్ రౌండ్‌ట్రీ గుర్తింపు పొందారు. ఈ సినిమాతో ఆయన చిన్న వయసులోనే ఓవర్ నైట్ స్టార్(Overnight Star) అయిపోయాడు. ఇది అమెరికన్ చరిత్రలో మొదటి బ్లాక్‌ప్లోయిటేషన్ చిత్రం. ఈ సినిమాలో ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో రిచర్డ్ నటించాడు. సినిమా స్క్రీన్‌ప్లేతో పాటు రిచర్డ్ పవర్‌ప్యాక్ పెర్ఫార్మెన్స్ ప్రజల హృదయాలను గెలుచుకుంది.
రిచర్డ్ మేనేజర్ ప్యాట్రిక్ మెక్‌మిన్నన్ మాట్లాడుతూ.. ఆయన కెరీర్ ఆఫ్రికన్, అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీలకు ఒక మలుపు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి మరువలేనిది అని కొనియాడారు.
రిచర్డ్ రౌండ్‌ట్రీ అమెరికా మొదటి బ్లాక్ యాక్షన్ హీరోగా గుర్తింపుపొందాడు. రౌండ్‌ట్రీ సక్సెస్ తర్వాత ఇతర నల్లజాతి కళాకారులకు కూడా గ్లామర్ ప్రపంచంలో మెరవడానికి మార్గం సుగమమైంది. 'షాఫ్ట్' సూపర్ సక్సెస్ తర్వాత రౌండ్‌ట్రీ 'షాఫ్ట్ ఇన్ ఆఫ్రికా', 'స్టీల్', 'మూవింగ్ ఆన్', 'మ్యాన్ ఫ్రైడే' వంటి పలు చిత్రాలకు పనిచేశాడు. రిచర్డ్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. ఆయన మొదటి వివాహం మేరీ జేన్‌తో జరిగింది. వీరి బంధం 1963 నుండి 1973 వరకు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 1980లో కరీన్ సెరెనాను పెళ్లాడాడు. రిచర్డ్‌కు నికోల్, టేలర్, మోర్గాన్, కెల్లీ అనే నలుగురు కుమార్తెలు ఉన్నారు.