అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతుంది మరాఠీ మూవీ వేదాంత్‌ మరాఠీ వీర్‌ దౌడు సాత్‌. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్న క్రమంలో.. సడెన్ గా ఓ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది..?

అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar) హీరోగా తెరకెక్కుతుంది మరాఠీ మూవీ వేదాంత్‌ మరాఠీ వీర్‌ దౌడు సాత్‌(Vedat Marathe Veer Daudle Saat). ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్న క్రమంలో.. సడెన్ గా ఓ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది..?

బాలీవుడ్(Bollywood) హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఛత్రపతి శివాజీమహారాజ్(Chatrapati Shivaji Maharaj) పాత్రలో కనిపించబోతున్న సినిమా వేదాంత్‌ మరాఠీ వీర్‌ దౌడు సాత్‌. మరాఠీ భాషలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నారు టీమ్. ఈక్రమంలోనే ఓ ప్రమాదం ఈసినిమా స్పీడ్ కు బ్రేక్ వేసింది. సెట్‌లో జరిగిన ఓ ప్రమాదం కారణంగా ఈమూవీ షూటింగ్ ఆగిపోయింది. అంతే కాదు ఈ ప్రమాదంలో ఒక యువకుడి పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. ప్రమాదానికి కారణం ఏంటీ..?

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే... వేదాంత్‌ మరాఠీ వీర్‌ దౌడు సాత్‌ మూవీ షూటింగ్(Movie Shooting) కొల్హాపూర్‌లో జరుగుతుంది. అయితే ఈ షూటింగ్ లో ఫొటోగ్రఫీ చేస్తున్న 19 సంవత్సరాల నగేశ్‌ ఖోబారే అనే యువకుడు.. కాలు జారడంతో నేరుగా ప్రమాదవశాత్తు వంద అడుగులు ఎత్తు నుంచి లోయలో పడిపోయాడు. దాంతో తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది.. కొల్హాపూర్‌లోని పన్‌హల్‌గడ్‌లో సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటన సెట్‌లో కలకలం సృష్టించింది. ఇది జరగ్గానే ముందుగా అతన్నిదగ్గరలో ఉన్న కొల్హాపూర్‌ ఆసుపత్రికి తరలించారు మూవీ టీమ్. అయితే పరిస్థితి మెరుకాకపోవడం.. ఇంకా విషయంగా తయారు అవ్వడంతో.. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై పోలీసుల విచారణ సాగుతుననట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి వారు చేరుకొని విచారించారు. కాని సినిమా టీమ్ కాని.. పోలీసులు కాని ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు.

ఇక శివాజీ మహారాజ్ కథతో.. మరాఠీ భాష(Marathi Language) లో తెరకెక్కుతుంది వేదాత్ మరాఠే వీర్ దౌడు సాత్ సినిమా. ఈమూవీకి నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ తెలుగులో కూడా చాలా సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేశారు. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటుగా . జై దుధానే, ఉత్కర్ష్ షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, అక్షయ్, నవాబ్ ఖాన్, ప్రవీణ్ తర్దే లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated On 21 March 2023 6:45 AM GMT
Ehatv

Ehatv

Next Story