బిగ్ బీ అమితాబచ్చన్(Amitha Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) పొలిటికల్ ఎంట్రీ(Political Entry) ఇవ్వబోతున్నారా..? సోషల్ మీడియాతో పాటు.. బాలీవుడ్ లో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత.. ఈ విషయంలో అభిషేక్ బచ్చన్ ఇచ్చిన క్లారిటీ ఏంటి..?
బిగ్ బీ అమితాబచ్చన్(Amitha Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) పొలిటికల్ ఎంట్రీ(Political Entry) ఇవ్వబోతున్నారా..? సోషల్ మీడియాతో పాటు.. బాలీవుడ్ లో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత.. ఈ విషయంలో అభిషేక్ బచ్చన్ ఇచ్చిన క్లారిటీ ఏంటి..?
ఇప్పటికే అమితాబ్(Amithab) తో పాటు.. ఆయన భార్య జయా బచ్చన్(Jaya Bachchan) కూడా పాలిటిక్స్ లో ఉండగా.. తాజాగా వారి తనయుడు.. వారసుడు అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ రాజకీయ ఆరంగేట్రానికి సిద్దం అవుతున్నారుట. సీనీరాజకీయ వర్గాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. బచ్చన్ ఫ్యామిలీ వారసత్వం తీసుకున్న అభిశేక్ ఎంపీగా(MP) పోటీ చేయబోతున్నట్టు న్యూస్ హల్ చల్ చేస్తోంది.
బచ్చన్ వారసత్వంలో బాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అభిశేక్... కాని ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వలేకపోయాడు. ఇక ఇప్పుడు వారి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని సమాచారం. అభిషేక్ బచ్చన్ తండ్రి అమితాబ్ బచ్చన్ 1984లో కాంగ్రెస్ తరపున ఇదే స్థానం నుంచి లక్ష్య భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. దాంతో అభిషేక్ ను కూడా.. అదే నియోజకవర్గం నుంచి రంగంలోకిదింపాలని చూస్తున్నారట సమాజ్ వాదీ పార్టీ నేతలు.
ఇక ఈ విషయంలో అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంత ఫేక్ న్యూస్(Fake News) అని.. తనకు అసలు రాజకీయల్లోకి రావాలన్న కోరిక కాని.. ఆశ కాని లేదని అభిషేక్ తన సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. దాంతో అభిషేక్ పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశ్యం లేనట్టు దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే అభిషేక్ తల్లి జయా బచ్చన్ సమాజ్‌వాదీ పార్టీ నేతగా, యూపీ నుంచి రాజ్య సభ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో, అభిషేక్‌ను కూడా రంగంలోకి దిగుతారని అనుకున్నారంతా.. కాని అది జరిగేలా లేదు. దాంతో సినిమా వారసత్వాన్ని అభిషేక్ కొనసాగుతుంది అనుకుంటున్నారు ఫ్యాన్స్.