జాతి రత్నాలు హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు పెళ్లిపై పెద్ద హోప్‌ లేదు.. పెళ్లి అయితే అవ్వోచ్చు.. కాకపోవచ్చు.. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని అయితే నాకు లేదని చెప్పుకొచ్చిందీ భామ. కానీ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం.. పిల్లలకు తల్లి మాత్రం అవుతాను.. పెళ్లి గురించి ఆలోచించాలని సమాధానం ఇచ్చింది.

జాతి రత్నాలు హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు పెళ్లిపై పెద్ద హోప్‌ లేదు.. పెళ్లి అయితే అవ్వోచ్చు.. కాకపోవచ్చు.. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని అయితే నాకు లేదని చెప్పుకొచ్చిందీ భామ. కానీ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం.. పిల్లలకు తల్లి మాత్రం అవుతాను.. పెళ్లి గురించి ఆలోచించాలని సమాధానం ఇచ్చింది.. అయితే పిల్లలకు(Kids) తండ్రి బాధ్యతలు కూడా ఉండాలి. పిల్లలను తల్లీతండ్రి ఇద్దరు కలిసే పెంచాలనడంలో ఎలాంటి సందేహం లేదంది. కానీ పెళ్లి(Marriage) విషయం వచ్చే సరికి... ఆలోచిస్తానని వివరించింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు తన జీవితం తన ఇష్టం అని సమర్థిస్తే.. కొందరు మాత్రం సమాజం, కట్టుబాట్లు అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే అల్లరి నరేష్‌ సరసన నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. ఫరియా అబ్దుల్లా తొలి చిత్రం జాతి రత్నాలు హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు పొందింది. దీంతో వరుసగా ఆఫర్ల కూడా దక్కించుకుంది. పలు సినిమాలకు సంతకాలు కూడా పెట్టింది. ఇది ఇలా ఉంటే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకుంది. పెళ్లిపై నమ్మకం లేదు కానీ పిల్లలు కావాలని చెప్పింది.

Updated On 8 May 2024 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story