సాయి పల్లవికి(Sai Pallavi) దక్షిణభారతమంతటా అభిమానులు ఉన్నారు. లేడి పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవిది మిగతా హీరోయిన్లతో పోలిస్తే భిన్నమైన వ్యక్తిత్వం. పాత్ర తనకు నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తారు. చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు.

సాయి పల్లవికి(Sai Pallavi) దక్షిణభారతమంతటా అభిమానులు ఉన్నారు. లేడి పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవిది మిగతా హీరోయిన్లతో పోలిస్తే భిన్నమైన వ్యక్తిత్వం. పాత్ర తనకు నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తారు. చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. . తన నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌తో విశేష క్రేజ్‌ సొంతం చేసుకున్న సాయి పల్లవి పేరు బాలీవుడ్‌ మీడియాలో మారుమోగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌(Aamir Khan) కుమారుడు జునైద్‌ ఖాన్‌(Junaid Khan) త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. అతడు నటిస్తున్న మొదటి సినిమాను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌(Yashraj Films) సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా పూర్తికాక మునుపే జునైద్‌ ఖాన్‌ మరో సినిమా ఒప్పుకున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమయ్యిందట! దీనికి సునీల్‌ పాండే(Sunil Pandey) దర్శకత్వం వహిస్తున్నాడని, ఇది ఒక ప్రేమ కథా చిత్రమని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్‌లో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అమిర్‌ ఖాన్‌ కుమారుడు జునైద్ పనిచేశాడు. ఈ మేరకు లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ డ్రామా స్కూల్‌లో కొన్నాళ్లు ట్రైనింగ్‌ తీసుకున్నాడు. తన తండ్రి నటించిన ‘పీకే’(PK) చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే అతను ఇప్పుడు హీరోగా సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించనున్నాడు. తన తండ్రి స్టార్‌ హీరో అయినప్పటికీ ఆయన పేరును ఎక్కడా వాడుకోకుండా మొదటి సినిమా అవకాశాన్ని సంపాదించుకున్నాడు జునైద్‌. అది కూడా అంత ఈజీగా దొరకలేదు. కనీసం ఓ 20 సార్లు అయినా ఇతడిని రిజెక్ట్ చేసి ఉంటారు. ఇక సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. అందం కాదు అభినయమే ఆమెకు ముఖ్యం. ఎప్పుడూ పాజిటివ్​గా స్మైల్​తో ఆకట్టుకునే సాయి పల్లవి వెండితెరపై తన పాత్రలకు ప్రాణంపోస్తారు. అయితే గత కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె చివరిసారిగా 2022లో వచ్చిన విరాట్ పర్వం, గార్గి చిత్రాలలో కనిపించారు. ప్రస్తుతం శివకార్తికేయన్​తో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఈ బాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.

Updated On 14 Sep 2023 1:07 AM GMT
Ehatv

Ehatv

Next Story