బాలీవుడ్ స్టార్ హీరో..మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్(Aamir Khan) చెన్నై(Chennai) షిప్ట్ అవుతున్నారట. షాకింగ్ గా అనిపించినా.. ఈవార్త నిజం. మరి ఆయన ఎందుకు చెన్నై వెళ్తున్నారు కారణం ఏంటి..?

బాలీవుడ్ స్టార్ హీరో..మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్(Aamir Khan) చెన్నై(Chennai) షిప్ట్ అవుతున్నారట. షాకింగ్ గా అనిపించినా.. ఈవార్త నిజం. మరి ఆయన ఎందుకు చెన్నై వెళ్తున్నారు కారణం ఏంటి..?

ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఆమీర్ ఖాన్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సాధించిన అమీర్‌ ఖాన్‌.. చివరిగా చేసిన సినిమా లాల్‌ సింగ్‌ చద్దా. విడుదల తర్వాత ఆయన కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అపజయం పాలవడంతో అమీర్‌ నిరాశ చెందారు. దీంతో సినిమాలకు విరామం ఇచ్చి కుటుంబంతో గడిపేందుకు టైమ్ కేటాయించినట్టు ప్రకటించారు ఆమీర్ ఖాన్.

ఇదిలా ఉంటే తాజాగా ఈ స్టార్‌ హీరో ముంబైను వదిలి చెన్నైకు షిఫ్ట్ అవ్వ‌తున్న‌ట్లు తెలుస్తుంది. అయితే స‌డ‌న్‌గా అమీర్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అభిమానులు కంగారు ప‌డుతున్నారు. ఇక అమీర్ ఖాన్ షిప్ట్ అవ్వ‌డానికి ముఖ్య కార‌ణం అత‌ని తల్లి అరోగ్య సమస్యలే అని తెలుస్తోంది. అమీర్ ఖాన్ రాబోయే రెండు నెలల మాత్రమే.. తాత్కాలికంగా చెన్నైలోనే ఉండనున్నారు. ఆయన చెన్నైలో ఉండాలని నిర్ణయించుకోవడమే కాదు.. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. అవును ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్(Zeenat Hussain) ప్రస్తుతం అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తల్లితో ఎంతో అనుబంధం కలిగి ఉన్న ఆమిర్ ఖాన్... ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు తాత్కాలికంగా ముంబయిన వీడి చెన్నైలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆమీర్ కూడా ఆమెకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే కొన్ని నెలల పాటు చెన్నైలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడ‌ట. అందుకు అనుగుణంగా తన తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి సమీపంలోనే ఉన్న ఏదైనా హోటల్‌లో బస చేయాలని ఆమీర్ అలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక నటనకు విరామం ఇచ్చిన అమీర్ ఖాన్ తన పూర్తి సమయాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తానని ఒక ఈవెంట్‌లో చెప్పిన విష‌యం తెలిసిందే.

ఆమిర్ ఖాన్ చివరగా లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటించాడు. ఈసినిమా స్టోరీ బాగున్నా.. సినిమా పెద్దగా హిట్ టాక్ సాధించలేకపోయింది. హాలీవుడ్ హిట్ చిత్రం ఫారెస్ట్ గంప్ కు ఇది రీమేక్. కానీ, లాల్ సింగ్ చద్ధా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ద్వారానే అక్కినేని నాగచైతన్య(Nagachaithanya) బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా రిజల్ట్ తరువాతే ఆమీర్ ఖాన్ యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆయన నటుడిగా కొనసాగకపోయినా.. నిర్మాణంపై దృష్టి సారిస్తానని తెలిపారు.

Updated On 22 Oct 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story