హిందీ నటులు దక్షిణాది సినిమాలలో నటించడం ఈ మధ్యకాలంలో ఎక్కువ అయ్యింది. ఇంతకు ముందు కూడా బాలీవుడ్‌ స్టార్లు నటించేవారు కానీ అప్పుడప్పుడు తళుక్కుమని మెరిసేవారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ జైలర్‌లో జాకీ ష్రాఫ్(Jockey shrof) నటించాడు. అలాగే విజయ్‌(Vijay) సినిమా లియోలో(Leo) సంజయ్‌ దత్‌(Sanjay dutt) నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా వస్తున్న దేవర సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan) విలన్‌గా కనిపించబోతున్నారు.

హిందీ నటులు దక్షిణాది సినిమాలలో నటించడం ఈ మధ్యకాలంలో ఎక్కువ అయ్యింది. ఇంతకు ముందు కూడా బాలీవుడ్‌ స్టార్లు నటించేవారు కానీ అప్పుడప్పుడు తళుక్కుమని మెరిసేవారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ జైలర్‌లో జాకీ ష్రాఫ్(Jockey shrof) నటించాడు. అలాగే విజయ్‌(Vijay) సినిమా లియోలో(Leo) సంజయ్‌ దత్‌(Sanjay dutt) నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా వస్తున్న దేవర సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan) విలన్‌గా కనిపించబోతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమీర్‌ఖాన్‌(Aamir Khan) కూడా తమిళ సినిమాలో కనిపించబోతున్నాడు. ఏజీఎస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దళపతి విజయ్‌తో నిర్మించబోతున్న సినిమాలో ఆమిర్‌ఖాన్‌ కూడా నటించబోతున్నారని తెలిసింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు రానుంది. అలాగే మోహన్‌రాజా దర్శకత్వంలో జయం రవి నటించనున్న తని ఒరువన్‌ 2లో కూడా అమిర్‌ఖాన్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఏజీఎస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థకు చెందిన ఐశ్వర్య ఇటీవల ఆమిర్‌ఖాన్‌ని కలిశారు. సమావేశం తర్వాత ఆమిర్‌ఖాన్‌తో కలిసి కలిసి దిగిన ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. దీంతో ఆమిర్‌ ఖాన్‌ దక్షిణాదికి రావడం ఖాయమనే వార్తలకు బలం చేకూరింది.

Updated On 6 Sep 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story