మొదట్లో రీనా దత్తాను(Reena Dutta) పెళ్లి చేసుకున్న ఆమీర్ .. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రొడ్యుసర్‌ కమ్‌ డైరెక్టర్‌ అయిన కిరణ్‌రావును(Kiran Rao) పెళ్లి చేసుకున్నాడు. ఈ కాపురం కూడా ఎక్కువ కాలం నిలువలేదు. ఆమెతోనూ గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆమీర్ ఖాన్‌ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు.

హేమిటేమిటి? బాలీవుడ్‌ నటుడు ఆమీర్ ఖాన్‌(Aamir Khan) మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా? నిజమేనా? మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరు సంపాదించుకున్న ఆమీర్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. రెండూ పెటాకులయ్యాయి. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతున్నాడట. అలాగని బాలీవుడ్‌లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. లాస్టియర్‌ వచ్చిన లాల్‌ సింగ్ చద్దా(Laal Singh Chedda) సినిమా అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. పాపం అమీర్‌ బాగా అప్‌సెట్‌ అయ్యాడు. మంచి కథతో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలన్న ఉద్దశంతో సినిమాలకు తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఆమీర్ ఖాన్‌ మూడో పెళ్లికి రెడీ అవుతున్నట్టు బాలీవుడ్‌ మీడియా అంటోంది.

మొదట్లో రీనా దత్తాను(Reena Dutta) పెళ్లి చేసుకున్న ఆమీర్ .. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రొడ్యుసర్‌ కమ్‌ డైరెక్టర్‌ అయిన కిరణ్‌రావును(Kiran Rao) పెళ్లి చేసుకున్నాడు. ఈ కాపురం కూడా ఎక్కువ కాలం నిలువలేదు. ఆమెతోనూ గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆమీర్ ఖాన్‌ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. కొంత కాలంగా దంగల్‌ నటి ఫాతిమా సన షేక్‌తో(Fathima Sana Shaik) డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆమీర్ నుంచి ఎలాంటి రియాక్షన్‌ రాలేదు. దాంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. నిజానికి కిరణ్‌రావుతో గొడవలు రావడానికి ఫాతిమానే కారణమని అంటుంటారు. సరిగ్గా అప్పట్నుంచే అమీర్‌ మూడో పెళ్లికి సంబంధించిన వార్తలు మొదలయ్యాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ముంబాయిలో(Mumbai) వీరిద్దరూ కలిసి పికిల్‌ బాల్‌ ఆడుతున్న వీడియో అయిదు రోజుల నుంచి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. దీనికి తోడు రీసెంట్‌గా రాఖీ సావంత్‌(Rakhi Savanth) చేసిన కామెంట్లు కూడా అమీర్‌ఖాన్‌ పెళ్లి వార్తకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇటీవల ఐఫా(IIFA) వేడుకల్లో రాఖీ సావంత్‌ పాల్గొన్నారు. బాలీవుడ్‌లో ముగ్గురు హాటెస్ట్ యాక్టర్స్‌ ఎవరు అని రాఖీ సావంత్‌ను యాంకర్‌ అడిగారు. దానికి రాఖీ సావంత్‌ జవాబిస్తూ షారూక్‌, సల్మాన్‌, మూడో వ్యక్తి మూడో పెళ్లి చేసుకోబోతున్న అమీర్‌ అయి ఉండవచ్చు అని అన్నారు. ఆ తర్వాత తన స్టేట్‌మెంట్‌ను ఉద్దేశిస్తూ సారీ ఆమీర్ .. ఐ లవ్‌ యూ అని రాఖీ సావంత్‌ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లు కూడా వైరల్ అవడంతో అమీర్‌ త్వరలోనే మూడో పెళ్లి చేసుకుంటాడని నిర్ధారణకు వచ్చేశారు చాలా మంది. మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే అమీర్‌ కంటే ఫాతిమా 26ఏళ్లు చిన్నది కావడం..!

Updated On 29 May 2023 2:25 AM GMT
Ehatv

Ehatv

Next Story