ఆమిర్ ఖాన్ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ తన 35 ఏళ్ల కెరీర్‌లో
ఓ రాజకీయ పార్టీని ప్రమోట్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమిర్ ఖాన్ బృందం ఆ వైరల్ వీడియోపై వివరణ ఇచ్చింది. నటుడు ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) కూడా దాఖలు చేశారు.
ఆమిర్ ఖాన్ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ తన 35 ఏళ్ల కెరీర్‌లో ఏ రాజకీయ పార్టీకి కూడా ఎప్పుడూ ప్రచారం చేయలేదని మేము స్పష్టం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రజా చైతన్య ప్రచారాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఆమిర్ ఖాన్ ప్రయత్నించారని వివరించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలంటూ ప్రజలను కోరుతున్న వైరల్ వీడియో ఫేక్ వీడియో అని కొట్టి పారేశారు. ఫేక్ వీడియో వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అమీర్ ఖాన్ టీమ్ కోరింది. సోషల్ మీడియాలో ఆమిర్ ఖాన్ వీడియో వైరల్ అవుతోంది. ఇది దాదాపు దశాబ్దం క్రితం ఆమిర్ హోస్ట్ చేసిన ‘సత్యమేవ జయతే’ షో సమయంలోనిది.