వరుడు(Varadu) సినిమాతో తెలుగు తెరపైమెరిసి.. బన్నీ హీరోయిన్ గా మారిపోయింది భానుశ్రీ మెహ్రా. కాని ఈసినిమాతో ప్రేక్షకుల మనసు మాత్రం మెప్పించలేకపోయింది ఈ పంజాబీ సోయగం. భాను శ్రీ మెహ్రా ఈ సినిమాలో అందాలు ఆరబోసి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

చేసిన సినిమాలు తక్కువే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తుంది అల్లు అర్జున్ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా(Bhanu Sri Mehra). తాజాగా ఆమె బీచ్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..

వరుడు(Varadu) సినిమాతో తెలుగు తెరపైమెరిసి.. బన్నీ హీరోయిన్ గా మారిపోయింది భానుశ్రీ మెహ్రా. కాని ఈసినిమాతో ప్రేక్షకుల మనసు మాత్రం మెప్పించలేకపోయింది ఈ పంజాబీ సోయగం. భాను శ్రీ మెహ్రా ఈ సినిమాలో అందాలు ఆరబోసి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

గతేడాది నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌ మిస్‌ ఇండియాతోపాటు(Miss India Projects) టెన్త్ క్లాస్ డైరీస్‌లో(10th Class Dairies) కీలక పాత్ర పోషించింది. అంతకు ముందు గోవిందుడు అందరి వాడేలే, అలా ఎలా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, మిస్టర్ ఇండియా, లాంటి సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. హిందీ తో పాటు తమిళం, కన్నడతో పాటు తన మాతృభాష పంజాబీ సినిమాల్లోను యాక్ట్ చేసింది భానుశ్రీ. కాని ఎక్కడా కూడా ఆమెకు కలిసి రాలేదు.

ఇక తాజాగా వెకేషన్(Vacation) లో ఉంది భానుశ్రీ... వియత్నాం హోయ్‌ యన్‌ సిటీలోని అందమైన లొకేషన్లలో చక్కర్లు కొడుతోంది. బీచ్ లో కూర్చోని బీర్లు తాగుతూ ఎంజాయ్ చేసిన ఈ భామ.. ఛిల్‌ అవుతోంది. మరోవైపు బీచ్‌లో బికినీ వేర్‌లో షికారు చేస్తూ.. చల్లని వాతావరణంలో వేడి పుట్టిస్తోంది.

చల్లని బీర్ తో..ఛిల్ వైబ్స్‌, ప్రైవేట్ బీచ్, సముద్రం తీరాన మ్యూజికల్‌ ఈవెంట్‌లను మిస్ అవ్వకండి.. అంటోంది బ్యూటీ.. తాను ఏం చేసినా.. సోషల్ మీడియాలో పంచుకుంటూ.. సందడి చేస్తోంది. తన ట్రావెల్‌ మ్యాగజైన్స్‌ స్టోరీలను రీల్స్‌గా పోస్ట్‌ చేస్తూ.. ఆ ఏరియా కు సబంధించిన విశేషాలు పంచుకుంటోంది.

వియత్నాంలోని రుచికరమైన శాఖాహారాన్ని ఆస్వాదించేందుకు ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. వియత్నాంలో శాఖాహారం దొరకడం కష్టమనేది అపోహ. నన్ను నమ్మండి.. మీరు దేశంలో ఎక్కడికి వెళ్లినా నోరూరించే ఫుడ్‌ పుష్కలంగా అందుబాటులో ఉంది.. అంటూ విశేషాలను పంచుకుంది.

ఇక నెట్టింట్లో ఫాలోయింగ్ పెంచుకోవడమే తక్ష్యంగా.. గట్టిగా ప్రయత్నం చేస్తోంది బ్యూటీ.. ప్రస్తుతం భానుశ్రీ సోషల్ మీడియా ఫాలోవర్లు.. 95.4K ఉన్నారు.

Updated On 8 July 2023 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story