పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) ఇటు సినిమాలతో(Cinema), అటు రాజకీయాలతో(Politics) చాలా బీజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌(Ustad bhagath singh) షూటింగ్‌లో ఉన్నారు. గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌(Harish Shankar) దర్శకత్వంలో పవన్‌ నటిస్తున్న సినిమా ఇదే కాబట్టి అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్‌ వర్క్‌ పూర్తి చేసుకుంటుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌(First glimpse) ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట ట్రెండింగ్‌ అవుతూ మిలియన్ల వ్యూస్‌ రాబడుతోంది. ఇదే ఇలా ఉంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానులు అనుకుంటున్నారు. ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్నారు. గబ్బర్‌సింగ్‌ తరహాలోనే పవన్‌కల్యాణ్‌ మరోసారి పోలీస్‌గానూ(Police), ఇతర భిన్నమైన గెటప్పుల్లోనూ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ నుంచి మేకర్స్‌ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా త్వరలో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నామని తెలిపారు. అశుతోష్‌ రాణా(Ashuthosh Rana), నవాబ్‌ షా(Nawab Shah), అవినాష్‌ గౌతమి(Avinash Gauthami), నర్రా శ్రీను(Narra Srinu), నాగ మహేశ్‌(Naga Mahesh), టెంపర్‌ వంశీ తదితరులు ఇందులో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్(Devi sri prasad) సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్‌ కల్యాణ్‌ క్రిష్‌(Kris) దర్శకత్వంలో హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu), సుజీత్‌(Sujith) దర్శకత్వంలో ఓజీ-ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌(OG), సాయి ధరమ్‌తేజ్తో కలిసి బ్రో(BRO) సినిమాలలో నటిస్తున్నారు.

Updated On 3 July 2023 8:03 AM GMT
Ehatv

Ehatv

Next Story