మరి కొన్ని గంటల్లో ఆదిపురుష్‌(adipurush) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రభాస్‌(prabhas) రాముడిగా, కృతి సనన్‌(kriti Sanon) సీతమ్మగా, సైఫ్‌ ఆలీఖాన్‌(saif Ali khan) రావణాసురుడిగా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 16న విడుదల కానుంది. ధియేటర్లు సరికొత్తగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతున్నాయి. ఒక్క ప్రభాస్‌ అభిమానులే కాదు, సినిమా ప్రేమికులందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

మరి కొన్ని గంటల్లో ఆదిపురుష్‌(adipurush) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రభాస్‌(prabhas) రాముడిగా, కృతి సనన్‌(kriti Sanon) సీతమ్మగా, సైఫ్‌ ఆలీఖాన్‌(saif Ali khan) రావణాసురుడిగా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 16న విడుదల కానుంది. ధియేటర్లు సరికొత్తగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతున్నాయి. ఒక్క ప్రభాస్‌ అభిమానులే కాదు, సినిమా ప్రేమికులందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. చిత్రబృందం ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నప్పటికీ సినిమా పేరు మాత్రం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారడం విశేషం.

టాలీవుడ్‌లో ఆదిపురుష్‌ గురించే చర్చిస్తున్నారు. అన్నట్టు ఆదిపురుష్‌ అనగానే ప్రధాన పాత్రధారులు ప్రభాస్‌, కృతి సనన్‌, దర్శకుడు ఓం రౌత్‌ తప్పితే మిగతా వివరాలేవీ చాలామందికి తెలియవు. ఇందులో దక్షిణాదికి చెందిన నటీనటులు లేకపోవడం కారణం కావచ్చు. ఇప్పుడు మనం ఆదిపురుష్‌ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఆదిపురుష్‌ సినిమాను 1992లో వచ్చిన రామాయణ: ద లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ(The legend of prince rama) అన్ని చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించారట.

అప్పుడా సినిమా యానిమేషన్ అయితే ఇప్పుడు నిజమైన నటీనటులతో తీశారు. ఆదిపురుష్‌కు మొదట్లో అనుకున్న బడ్జెట్‌ 400 కోట్ల రూపాయలు. కాకపోతే లాస్టియర్ టీజర్‌ రిలీజ్‌ తర్వాత బోల్డన్నీ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ పరమ నాసిరకంగా ఉన్నాయని చాలా మంది తిట్టిపోశారు. దీంతో చిత్ర యూనిట్‌ గ్రాఫిక్స్ కోసం అదనంగా మరో వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో ఆదిపురుష్‌ బడ్జెట్‌ కాస్తా 500 కోట్ల రూపాయలకు చేరుకుంది. సీతమ్మ పాత్ర దొరకడం కృతి సనన్‌ అదృష్టమేనని చెప్పాలి. ఎందుకంటే ఈ పాత్ర కోసం అనుష్క షెట్టి, అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్‌ ఇలా చాలా మందిని అనుకున్నారు. చివరకు కృతి సనన్‌ అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చి ఆమెను ఎంపిక చేసుకున్నారు.

ఆదిపురుష్‌ కోసం దర్శకుడు ఓం రౌత్‌ మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని వినియోగించారట. 2021లో షూటింగ్‌ మొదలైన కొద్ది రోజులకు ముంబాయిలో వేసిన సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అలాంటి సెట్‌నే మళ్లీ వేసి షూటింగ్‌ పూర్తి చేశారు. ఈనెల 6వ తేదీన తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందుకోసం మూవీ టీమ్‌ రెండు కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేసింది. థియేటర్లలో రిలీజ్‌ చేయడానికి ముందు జూన్‌ 13వ తేదీన ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆదిపురుష్‌ స్క్రీనింగ్‌ ఉందని చెప్పారు. అయితే కారణాలేమిటో తెలియదు కానీ ఆ స్క్రీనింగ్‌ రద్దు అయ్యింది.

ఆదిపురుష్‌ సినిమా కోసం ప్రభాస్‌ 150 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారట. దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ను అందుకున్న నటుడు ప్రభాసే. ఆ విధంగా ఓ రికార్డు సృష్టించాడు ప్రభాస్‌. ఆదిపురుష్‌ సినిమాను త్రీడీతో పాటు ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఐమ్యాక్స్‌ వెర్షన్‌ను క్యాన్సిల్‌ చేశారు. ఇందుకు కారణం హాలీవుడ్‌ మూవీ ద ఫ్లాష్‌ అని అంటున్నారు. ఆదిపురుష్‌ షూటింగ్‌ ఓకేసారి తెలుగు, హిందీ భాషలలో జరిగింది. తెలుగులో ప్రభాస్‌ డబ్బింగ్‌ చెప్పాడు కానీ హిందీలో మాత్రం ప్రభాస్‌కు శరద్‌ కేల్కర్‌ డబ్బింగ్‌ చెప్పారు.
బాహుబలి హిందీ వెర్షన్ కి ఇతడే డబ్బింగ్‌ చెప్పాడట!

Updated On 15 Jun 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story