సుమారు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా నటిస్తూ ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతున్న నటి తమన్నా భాటియా(Tamannaah Bhatia)! మిల్కీ బ్యూటీగా పేరొందిన ఆమె క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆ అందాల భామ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. మధ్యమధ్యలో వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ఇటీవల వచ్చిన లస్ట్‌ స్టోరీస్‌-2(Lust stories-2)తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు.

సుమారు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా నటిస్తూ ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతున్న నటి తమన్నా భాటియా(Tamannaah Bhatia)! మిల్కీ బ్యూటీగా పేరొందిన ఆమె క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆ అందాల భామ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. మధ్యమధ్యలో వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ఇటీవల వచ్చిన లస్ట్‌ స్టోరీస్‌-2(Lust stories-2)తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఇక ఆమె మెగాస్టార్‌ చిరంజీవితో(Chiranjeevi) నటించిన భోళాశంకర్‌(Bholashankar), సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో(Rajinikanth) నటించిన జైలర్‌ వచ్చే వారం విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల అవుతుండటం విశేషం. ఇప్పటికే రిలీజైన జైలర్ సాంగ్ కావాలయ్యా అంటూ అభిమానలను ఓ రేంజ్‌లో ఊపేస్తోంది ముద్దుగుమ్మ. ఇప్పుడు ఇదే పాట సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సావానికి వెళ్లిన భామకు అభిమానుల తాకిడి ఎదురైంది. కేరళలోని(Kerala) కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి(inauguration) వెళ్లారు తమన్నా భాటియా. అక్కడ ఆమెకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె చుట్టూ బౌన్సర్లు ఉన్నప్పటికీ వారందరినీ తప్పించుకుని ఏకంగా తమన్నా చేయిని పట్టుకున్నాడు ఓ అభిమాని. దీంతో అక్కడున్న బౌన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై ‍అతన్ని పక్కకు లాగేశారు. అయితే అభిమాని అత్యుత్సాహాన్ని గమనించిన తమన్నా బౌన్సర్లకు నచ్చజెప్పి అభిమానితో నవ్వుతూ సెల్పీ దిగారు. మరీ మిల్కీ బ్యూటీ అభిమానులంటే ఆ మాత్రం ఉంటది అంటున్నారు నెటిజన్స్. కాగా రజినీకాంత్ సరసన తమన్నా నటించిన జైలర్ ఈనెల 10న విడుదల కాబోతున్నది. అలాగే మెగాస్టార్ భోళాశంకర్ కూడా ఈనెల 11వ తేదీన రిలీజ్ కానుంది.

Updated On 8 Aug 2023 12:20 AM GMT
Ehatv

Ehatv

Next Story