శ్రీలంకన్‌ ఆఫ్‌ స్పిన్నర్... లెజెండరీ క్రికెట్‌ ప్లేయర్, ముత్తయ్య మురళీధరన్‌ (Muthiah Muralidaran) బయోపిక్‌ తెరకెక్కాబోతోంది. 800 టైటిల్(‌800 Title)తో తెరకెక్కుతున్న ఈసినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

శ్రీలంకన్‌ ఆఫ్‌ స్పిన్నర్... లెజెండరీ క్రికెట్‌ ప్లేయర్, ముత్తయ్య మురళీధరన్‌ (Muthiah Muralidaran) బయోపిక్‌ తెరకెక్కాబోతోంది. 800 టైటిల్(‌800 Title)తో తెరకెక్కుతున్న ఈసినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

లెజెండరీ క్రికెటర్... శ్రీలంకన్‌ ఆఫ్‌ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ (Muthiah Muralidaran) బయోపిక్‌ సిల్వర్ స్క్రీన్ ఎట్టకేళకుసందడి చేయబోతోంది. తమిళనాట ఎన్నోవివాదాలకు కారణం అయిన ఈ సినిమా ప్రపోజల్ ఆగిపోతుంది అనుకున్నారు అంతా .. కాని ఈసినిమాపై టైటిల్ తో సహా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. 800 టైటిల్(‌800 Title)తో రూపొందుతోన్న ఈమూవీ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమా లో మురళీధరన్‌ పాత్రలో స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ ఫేం మధుర్‌ మిట్టల్‌ (Madhurr Mittal)నటిస్తున్నాడు. మురళీధరన్‌ లుక్‌ లో మధుర్ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్.

ముత్తయ్య మురళీధరన్ పుట్టినరోజు(17 ఏప్రిల్)సందర్భంగా మేకర్స్ స్పెషల్ లుక్‌ ను రిలీజ్ చేయగా..అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు ముందుగా మురళీధరన్ పాత్రలో మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతిని తీసుకున్నారు. చాలా కాలం క్రితమే కన్ ఫార్మ్ అయిన ఈమూవీలో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. అయితే తమిళనాట ఈవిషయంలో వివాదం భగ్గుమంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. శ్రీలంకలో ఎల్‌టీటీఈతో సివిల్‌ వార్‌ సమయంలో అప్పటి శ్రీలంక ప్రధాన మంత్రి రాజపక్సకు ముత్తయ్య మురళీధరన్‌ మద్దతు ఇవ్వడంతో మురళీ ధరన్ పై తమిళులు ఆగ్రహంతో ఉన్నారు. ఆయనపై తమిళ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

దాంతో విజయ్ సేతుపతిపై ఒత్తిడిపెరిగింది. ఈసినిమా నుంచి తప్పుకోవాలంటూ.. తమిళనాట డిమాండ్ మొదలయ్యింది. ఈ విషయం లో... తన బయోపిక్‌ నుంచి తప్పుకోవాలని విజయ్ సేతుపతికి మురళీధరన్‌ కూడా ఓ లేఖ కూడా రాశాడు. తన వల్ల ఏ నటుడూ ఇబ్బంది పడకూడదని.. అందుకే ఇబ్బదులు కొని తెచ్చుకోవద్దంటూ.. మురళీధరన్ లేఖ రాయగా.. ఆయన కోరిక మేరకు విజయ్‌ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో ఈమూవీ ఆగిపోయి ఉంటుంది అనుకున్నారంతా.. కాని ఈమూవీ ప్రస్తుతం షూటింగ్ కు వెళ్ళడానికి రెడీ అవుతోంది.

ఎంఎస్ శ్రీపతి డైరెక్షన్ చేస్తున్న ఈసిమాకు అతనే కథనుఅందిస్తున్నారు. తమిళంతోపాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా ఈ మూవీ విడుదల కానుంది. ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్‌ రంగచారి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది (2023) థియేటర్లలోకి రానుంది.కెరీర్‌లో 800 టెస్ట్‌ వికెట్స్‌ తీసిన ఒకే ఒక ఆఫ్‌ స్పిన్నర్‌ బౌలర్‌గా అరుదైన రికార్డు మురళీధరన్‌ ఖాతాలో ఉంది. ఈ రికార్డు స్ఫూర్తితోనే సినిమాకు 800 టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

Updated On 17 April 2023 6:49 AM GMT
Ehatv

Ehatv

Next Story