స్టార్ హీరోలు నటిచకపోయినా.. కొన్నిసినిమాలు కొత్త ట్రెండ్ ను సృష్టిస్తాయి.. యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. కొన్నేళ్ల పాటు అలా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో 7/G బృందావన కాలనీ (7/G Brindavan Colony)కూడా ఒకటి. ఈమూవీని మళ్లీ థియేటర్ లో చూసే అవకాశం లభించబోతోంది.
స్టార్ హీరోలు నటిచకపోయినా.. కొన్నిసినిమాలు కొత్త ట్రెండ్ ను సృష్టిస్తాయి.. యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. కొన్నేళ్ల పాటు అలా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో 7/G బృందావన కాలనీ (7/G Brindavan Colony)కూడా ఒకటి. ఈమూవీని మళ్లీ థియేటర్ లో చూసే అవకాశం లభించబోతోంది.
దాదాపు 20 ఏళ్ల క్రితం అంటే.. 2004లో ప్రేక్షకుల ముందుకొచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా 7/G బృందావన కాలనీ (7/G Brindavan Colony)సినిమా. యూత్ లో కొత్త ట్రెండ్ ను.. లవర్స్ కు కొత్త రూట్ ను చూపించి.. అందరి చేత కంటతడి పెట్టించిన సినిమా అది. వాళ్లు వీళ్ళు అని లేదు.. యూత్ అంతా.. ఈ సినిమాకు సలాం చేశారు. అంతేనా.. ఎక్కడ చూసినా.. కన్నుల బాసలు తెలియవులే పాట మారుమోగింది. ఈ దెబ్బతో ఆ కొత్త హీరో రవికృష్ట స్టార్ గా మారడం ఖాయం అనుకున్నారు. కాని ఆతరువాత అడ్రస్ లేకుండా పోయాడు పాపం.
తమిళ స్టార్ హీరో ధనుష్ అన్న సెల్వ రాఘవన్ (Selvaraghavan) డైరెక్షన్‌లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ నడుస్తుందన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ ఆల్ టైమ్ ఎవర్‌గ్రీన్ సూపర్ హిట్ సినిమాను మరోసారి థియేటర్ లో చూసే అవకాశం కల్పించబోతున్నారు మేకర్స్.
7/G బృందావన కాలనీ చిత్రాన్ని సెప్టెంబర్ 22న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు ఈమూవీని అలాగే రిలీజ్ చేయకుండా.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టుగా 4K version, Dolby Atmos technologyలో అందుబాటులో ఉండబోతున్నట్టు ప్రకటించారు. కల్ట్ లవ్ టేల్ మ్యాజిక్‌ను మరోసారి అనుభవించే సమయం ఇది.. అంటూ నిర్మాత ఎస్‌కేఎన్ ఈ పోస్టర్‌ను షేర్ చేశారు.
దాదాపు 19 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఈసినిమా థియేటర్లకు భారీగా వరుసలు కట్టేలా చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అంతే కాదు గతంలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా రెండు భాషల్లో బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది. ప్రోడ్యూసర్ల పండ పండించింది. కాసుల వర్షం కురిపించింది. రవికృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్(Sonia Agarwal) కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాగా.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో సీనియర్ నటులు చంద్రమోహన్, విజయన్, సుమన్ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రలు చేశారు. అయితే మన తెలుగులో 7/G బృందావన కాలనీగా బాగా నోటెడు అయిన ఈసినిమా తమిళంలో మాత్రం 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది.